News
తుంగభద్ర డ్యాం లో పెరిగిన నీటిమట్టం తేది 10.07.2024

కర్ణాటక: తుంగభద్ర:
తుంగభద్ర జలాశయానికి స్వల్పంగా వరద నీరు
ఇన్ ఫ్లో : గడచిన 24 గంటల్లో 27544 క్యూసెక్కులు
ఇన్ ఫ్లో : ప్రస్తుతం(Live) 20285 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : నిల్
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1602.67 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం : 25.173 టీఎంసీలు
News
పరీక్ష వ్రాయటానికి యజ్ఞోపవీతాన్ని అవమానించరు.. బ్రాహ్మణ, పురోహిత సంఘం

కర్నూలు జిల్లా ఆదోనిలో రాష్ట్ర పురోహిత సమాఖ్య అధ్యక్షుడు గరుడాద్రి దత్తాత్రేయ శర్మ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మ సంస్థాపన వ్యవస్థాపనకు మూలాధారమై వేద ధర్మానికి ప్రతినిధిగా సనాతన ధర్మ సంస్థాపన సూత్రమైనటువంటి యజ్ఞోపవీతాన్ని అవమానపరుస్తూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం బీదర్, షిమోగా పట్టాన లాంటి ప్రాంతాలలో సెట్ పరీక్షలు రాయటానికి వెళ్ళినటువంటి బ్రాహ్మణ విద్యార్థులను ఘోరంగా అవమానపరుస్తూ యజ్ఞోపవీతాన్ని తొలగిస్తేనే పరీక్ష రాయటానికి అనుమతిస్తామని యజ్ఞోపవీతాన్ని కత్తిరించి డస్ట్ బిన్లలో వేయించిన తర్వాత పరీక్ష వ్రాయటానికి అనుమతించడాన్ని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ, సమాఖ్య పురోహిత విభాగం తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.

ప్రభుత్వాల దృష్టిలో యజ్ఞోపవీతం అంటే తొమ్మిది దారాల బలమై ఉండవచ్చేమో కానీ హిందూ ధర్మం ప్రకారం వేదాలలో యజ్ఞోపవీతానికి ఇచ్చినటువంటి అర్థం ఏమిటో తెలియదు అనుకుంటాను మానవుడు ధర్మబద్ధంగా జీవించి మోక్షం వైపు నడవడానికి మూలాధారమై బుద్ధిని జ్ఞానాన్ని తేజస్సును వర్చస్సును ఆరోగ్యాన్ని పవిత్రతను ఆయుష్షును పెంపొందించే సూత్రం యజ్ఞోపవీతం. ఈ యజ్ఞోపవీతంలో ఉండే తొమ్మిది సూత్రాలు తొమ్మిది పరమపవిత్రమైన శక్తులు. ఓంకార అగ్ని నాగ సోమ పితృ ప్రజాపతి వాయు సూర్య విశ్వేదేవతత్వములు 9 ధార పోగులలో నిబిడి కృతమై ఉంటాయని తెలిపారు. ఈ యజ్ఞోపవీతాన్ని దారుణంగా అవమానించిన ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ యజ్ఞోపవీతం తీయవలసి వస్తుంది అని పరీక్షనే వదులుకున్నటువంటి విద్యార్థులకు తిరిగి పరీక్షలు వ్రాయించాలని డిమాండ్ చేశారు. వేదాన్ని వేద ధర్మాన్ని మఠాలను పీఠాలను అవమానపరిచే ఏ ప్రభుత్వాలకు మనుగడ ఉండదని ఇంతకు పూర్వం ఇదేవిధంగా వేద ధర్మాన్నిఅవమానించి తీవ్రమైన ప్రమాదాలను ఎదుర్కొన్న రాష్ట్రాల అనుభవాలను గుర్తు చేశారు.
News
అదోనిలో 60 లక్షల బంగారు స్వాధీనం

కర్నూలు జిల్లా ఆదోని శివారు ఆస్పరి బైపాస్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా రశీదు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 600 గ్రాముల బంగారు బిస్కెట్లను సీఐ రాజశేఖర్ స్వాధీనం చేసుకున్నారు. వాటితోపాటు ఒక సెల్ ఫోను, కారు సీజ్ చేశారు. సిఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వాహనాలు తనికి చేస్తుండగా ఫజల్ అనే బంగారు వ్యాపారి వద్ద ఆరు బంగారు బిస్కెట్లు గుర్తించామని వాటికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు బిల్లులు చూపించకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకుని సంబంధిత ఇంకమ్ టాక్స్ అధికారులకు అప్పగించామని తెలిపారు. వాటితో పాటు ఒక సెల్ ఫోను కారును కూడా సీజ్ చేసినట్లు తెలిపారు.
News
భారీ అగ్ని ప్రమాదం లక్షల్లో ఆస్తి నష్టం

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుంబలం గ్రామంలో హజరత్ కిరాణా షాపులో విద్యుత్ షాట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షాపులోని కిరాణ సరుకులు , 50 వేలు రూపాయల నగదు కాలి బూడిదైనయి. లక్షలో ఆస్తి నష్టం ఉంటుందని అంచనా..


-
News3 days ago
భారీ అగ్ని ప్రమాదం లక్షల్లో ఆస్తి నష్టం
-
News1 week ago
అంతర్జాతీయ దొంగల ముఠా అరెస్ట్
-
News1 day ago
అదోనిలో 60 లక్షల బంగారు స్వాధీనం
-
Business7 days ago
Gold, Silver Price భారీ గా పెరిగిన బంగారు వెండి ధరలు
-
News11 hours ago
పరీక్ష వ్రాయటానికి యజ్ఞోపవీతాన్ని అవమానించరు.. బ్రాహ్మణ, పురోహిత సంఘం
-
Business3 days ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
News4 days ago
ఆదోని రైతు బజార్ లో టమాట కేజి ₹ 18 రూ.