News
వాలంటీర్లు లేకుండా ఇంటింటి సర్వే జరగాలి
◆ వాలంటీర్లు లేకుండా ఇంటింటి సర్వే జరగాలి
◆ తప్పులు లేకుండా ఓటరు జాబితా సవరణ కార్యక్రమం నిర్వహించాలి.. సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్
కర్నూలు జిల్లా ఆదోని మునిసిపల్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమము-2024కు సంబంధించి అదనపు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు మరియు మున్సిపల్ కమిషనర్ ఎన్నికల ఉపతహసీల్దార్లతో సబ్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటి సర్వే మరియు ఓటరు జాబితా సవరణ కార్యక్రమము నిర్వహించాలని, ఎటువంటి లోపాలకు తావివ్వకుండా 2024 తుది ఓటర్ల జాబితాను రూపొందించలని కోరారు. గ్రామ/వార్డు వాలంటీర్లు ఎన్నికలకు ఏవిధమైన పనులలోనూ పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. బూతు స్థాయి అధికారులకు ఇంటింటి సర్వే మరియు స్పెషల్ సమ్మరీ రివిజన్- 2024 కి సంబంధించి శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎటువంటి అపోహలు ఉండకుండా, బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకొమని సూచిస్తూ, ఇంటింటి ఓటరు సర్వేలో భాగస్వామ్యుల అయ్యేలా చూడాలన్నారు. ఏజెంట్ల జాబితాను ఎన్నికల అధికారి కార్యాలయంలో సమర్పించాలన్నారు.
ఓటర్ల పరిశీలన చేస్తున్న సమయంలో
ఏజెంట్లు తప్పనిసరిగా ఉండేల చూడాలని అన్నారు. ఎఈఆర్ఓలు ఓటరు నమోదు మరియు తొలగింపులను జాగ్రత్తగా పరిశీలించిన తరువాతనే ఆమోదించాలన్నారు. మరణించిన వారి జాబితాను మరణ ధ్రువీకరణ పత్రము లేదా పంచనామ ద్వారా ధ్రువీకరించి, క్షుణ్ణంగా పరిశీలించి ఓటరు జాబితా నుంచి తొలగించలన్నారు. ఒకే ఇంటిలో ఎక్కువ మొత్తములో ఓటర్లు ఉంటే వేరువేరుగా నివాసాలు ఉన్న వారికి ఒక పద్దతి ప్రకారం ఇంటి నెంబరు ఇవ్వాలన్నారు. ఒకే పోలింగ్ బూత్ లో చేర్చాలని , ప్రతి ఓటరు తన ఇంటి నుంచి 2 కిలోమీటర్ల పరిధిలోనే పోలింగ్ స్టేషన్ చేరుకునే విధంగా ఏర్పాటు చేయాలని ఏఈఆర్ఓ మరియు ఎన్నికల తహశీల్దార్లు వారి సంబంధిత నియోజకవర్గములోని ప్రతి కళాశాలలో SVEEP కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. భారత ఎన్నికల కమిషన్ వారి ఆదేశాల మేరకు 18 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని ట్రాన్స్ జెండర్స్ , సెక్స్ వర్కర్లు మొదలగువారు ఓటర్లుగా నమోదు చేయవలసిందిగా కోరారు. ప్రస్తుతము వయస్సు 17 సంవత్సరాలు ఉండి జనవరి 2024 సంవత్సరానికి 18 సంవత్సరాలు వచ్చే వారిని కూడా గుర్తించి సమాచారాన్ని సేకరించి పెట్టుకోవాలని తెలిపారు. 90 సంవత్సరాలు నిండిన వారు, వికలాంగులు నడవలేని పరిస్థితిలో ఉంటే ఇంటి దగ్గరే ఓటు వేసుకునే అవకాశం కల్పించడానికి తగిన సమాచారం సేకరించి పెట్టుకోవాలని కోరారు.
*కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్ట్రోల్ రేషియో ప్రకారం 680 నుండి 720 వరకు electoral population ratio ఉండాలి కాని ఆదోని నియోజకవర్గం electoral population ratio 845 వరకు ఉన్నది. నియజకవర్గం నుండి వెళ్లిపోయిన, మరణించిన వారి ఓట్లు తొలగించాలని వాటికి సంబంధించిన అన్ని వివరాలు సేకరించుకొని తొలగించాలని తెలిపారు. ఈ సమావేశంలో తాసిల్దార్ వెంకటలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ అనుపమ్మ అధికారులు పాల్గొన్నారు.



News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




