News
రామజల చెరువుకు పూర్వ వైభవం తెస్తాం
కర్నూలు జిల్లా ఆదోని ప్రజలకు వందల ఏళ్లుగా త్రాగునీరు అందించిన చారిత్రక రామజల చెరువులో నీరు అధికారులు , పాలకుల నిర్లక్ష్యంతో గత మూడేళ్లుగా నిరుపయోగంగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్ లో బసాపురం SS ట్యాంక్ పూర్తిగా డ్యామేజ్ కావడంతో మున్సిపల్ అధికారులు త్రాగునీరు పూర్తి స్థాయిలో నిల్వ చేయలేకపోయారు.

వేసవిలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా మార్చిలో అధికారుల దృష్టి రామజల పై పడింది. అందులో ఉన్న నీరు త్రాగడానికి పనికిరావని పరీక్షించిన నిపుణులు తెలియచేయడంతో వెంటనే నీరు ఖాళీ చేయడానికి మున్సిపల్ అధికారులు చేపట్టిన చర్యలకు ఎన్నికలు అడ్డంకి కావడంతో ఆ పని అక్కడే ఆగిపోయింది.

ఎన్నికల కార్యక్రమాలు పూర్తయ్యాక ప్రస్తుతం ఉన్న మున్సిపల్ కమిషనర్ రామ చంద్రారెడ్డి రామజల చెరువులో సుమారు 850 మిలియన్ లీటర్ల నీరు ఉన్నట్టు అంచనా వేసి ఆ నీరు ఖాళీ చేయడానికి సైపనింగ్ సిస్టం మరియు విద్యుత్ మోటార్ల ద్వారా రోజుకు 22 మిలియన్ లీటర్ల నీరు పంపింగ్ జరుగుతున్నదని,

గత 12 రోజులుగా సుమారు 250 మీ. లీ నీరు ఖాళీ అవగా మిగిలిన 600 మిలియన్ లీటర్ల నీటిని మరో ముప్పై రోజుల్లోగా ఖాళీ చేస్తామని ఆతర్వాత LLC కెనాల్ నుండి పంపింగ్ ద్వారా చేరువులో నీరు నింపాక శుద్ధి పరిచిన నీటిని ఆదోని లోని 17 వార్డుల ప్రజలకు త్రాగునీటి సౌకర్యం అందించడానికి అవకాశం ఉందని మున్సిపల్ కమిషనర్ రామ చంద్రారెడ్డి తెలిపారు.



News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్‌సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్‌సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్‌సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్‌సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్‌ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




