భారీ మొత్తంలో వెండి స్వాధీనం చేసుకున్న పోలీసులు

■ భారీ మొత్తంలో వెండి స్వాధీనం..
■ మచిలీపట్నం చెందిన వ్యక్తి నుండి 26 కేజీల వెండిని స్వాధీనం..
■ ఎటువంటి ఆధారాలు రసీదులు చూపీకపోవడంతో ఇన్కమ్ టాక్స్ అధికారులకు అప్పజెప్తామన్న సిఐ శ్రీనివాస్ నాయక్

కర్నూలు జిల్లా ఆదోనిలో కొత్త బస్టాండ్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా మచిలీపట్నం చెందిన వ్యక్తి నుండి వెండి సామాగ్రి, వెండి బిస్కెట్లు టూ టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
టూ టౌన్ సీఐ శ్రీనివాస్ నాయక్ ఇచ్చిన వివరాల మేరకు మంగళవారం సాయంత్రం కొత్త బస్టాండ్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా మచిలీపట్నం చెందిన వ్యక్తి నుంచి సుమారు 26 కేజీల వెండి సామాగ్రి, వెండి బిస్కెట్లకు ఎటువంటి ఆధారాలు రసీదులు లేకపోవడంతో స్వాధీనం చేసుకుందామని తెలిపారు. అయితే ఇటువంటి ఆధార్ లేనందున వెండి మొత్తాన్ని ఇన్కమ్ టాక్స్ అధికారులకు అప్పగిస్తామని సీఐ శ్రీనివాస్ నాయక్, ఎస్ఐ చంద్ర తెలిపారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న వెండి ఆభరణాలు
యూట్యూబ్ వీడియో చూడాలంటే దీనిపై క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top