News
ఇంటర్ తర్వాత చేయడానికి అవకాశం ఉన్న ఉన్నతమైన 113 కోర్సులు ఇవే… After Class +12
ఇంటర్ తర్వాత చేయడానికి అవకాశం ఉన్న ఉన్నతమైన 113 కోర్సులు ఇవే…
ఇంటర్ తర్వాత విద్యార్థులు ఏ చదువులకు వెళ్లాలో అర్థం కాక సతమత పడుతుంటారు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం రూపొందించిన బుక్ లెట్ లో సీ.బీ.ఎస్.ఈ (CBSE) ప్రధానంగా వివరించిన 113 కోర్సులు ఇవి.

001. ఏరోనాటికల్ ఇంజనీరింగ్
002. ఏరోస్పేస్ ఇంజనీరింగ్
003. ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్
004. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్
005. ఆస్ట్రోనమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్
006. ఆటోమొబైల్ ఇంజనీరింగ్
007. బయో మెడికల్ ఇంజనీరింగ్
008. బయో టెక్నాలజీ ఇంజనీరింగ్
009. సెరామిక్స్ ఇంజనీరింగ్
010. కెమికల్ ఇంజనీరింగ్
011. సివిల్ ఇంజనీరింగ్
012. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్
013. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
014. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
015. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్
016. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్
017. ఇంస్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్
018. మ్యాన్యుఫ్యాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
019. మెరైన్ ఇంజనీరింగ్
020. మెకానికల్ ఇంజనీరింగ్
021. మెడికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
022. మెటాలర్జీ
023. మెటరాలజీ
024. మైనింగ్ ఇంజనీరింగ్
025. నావల్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్
026. ఫిజికల్ సైన్సెస్
027. పాలీమర్ ఇంజనీరింగ్
028. రోబోటిక్స్
029. టెక్స్‌టైల్ ఇంజనీరింగ్
030. అగ్రికల్చర్ సైన్స్
031. బయోలాజికల్ సైన్స్
032. బయోటెక్నాలజీ
033. కంప్యూటర్ అప్లికేషన్స్
034. కంప్యూటర్ సైన్స్
035. సైబర్ సెక్యూరిటీ
036. ఎర్త్ సైన్స్ / జాగ్రఫీ
037. ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్
038. ఫిషరీస్
039. ఫ్లోరికల్చర్/హార్టికల్చర్
040. ఫుడ్ టెక్నాలజీ
041. ఫారెస్ట్రీ
042. ఓషియనోగ్రఫీ
043. స్టాటిస్టికల్ సైన్స్
044. వెటర్నరీ సైన్సెస్
045. వైల్డ్ లైఫ్ బయాలజీ
046. జువాలజీ
047. ఆయుర్వేద బీఏఎంఎస్
048. డెంటల్ బీడీఎస్
049. హోమియోపతి
050. న్యాచురోపతి
051. ఫార్మసీ
052. సిద్ధ
053. యునానీ
054. ఆంత్రోపాలజీ
055. ఆర్కియాలజీ
056. ఆర్ట్ రిస్టోరేషన్
057. క్యూరేషన్
058. ఎడ్యుకేషనల్/వొకేషనల్ స్కూల్ కౌన్సిలర్
059. మాన్యుమెంట్స్ అండ్ స్కల్ప్చర్ రిస్టోరేషన్
060. మ్యూసియాలజీ
061. ఫిజియోథెరపీ
062. రిహ్యాబిలిటేషన్ సైకాలజీ
063. రిహ్యాబిలిటేషన్ థెరపీ
064. సోషల్ వర్క్
065. స్పెషల్ ఎడ్యుకేటర్
066. స్పీచ్ లాంగ్వేజ్ అండ్ హియరింగ్
067. లా
068. అడ్వర్టైజింగ్
069. జర్నలిజం
070. మాస్ కమ్యూనికేషన్
071. పబ్లిక్ రిలేషన్స్
072. ఆర్ట్ డైరెక్షన్
073. కొరియోగ్రఫీ
074. డైరెక్షన్
075. ఫిల్మ్/డ్రామా ప్రొడక్షన్
076. ఫైన్ ఆర్ట్స్
077. పర్ఫామింగ్ ఆర్ట్స్
078. వోకల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్
079. యానిమేషన్
080. సినిమాటోగ్రఫీ
081. కమ్యూనికేషన్ డిజైన్
082. డిజైన్
083. గ్రాఫిక్ డిజైనింగ్
084. ఫోటోగ్రఫీ
85. యాక్చురియల్ సైన్సెస్
086. బ్యాంక్ మేనేజ్‌మెంట్
087. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్
088. బిజినెస్ మేనేజ్‌మెంట్
089. కాస్ట్స్ అండ్ వర్క్స్ అకౌంట్స్
090. చార్టర్డ్ అకౌంటెన్సీ
091. చార్టర్డ్ ఫైనాన్షియల్ అనాలిసిస్
092. ఈవెంట్ మేనేజ్‌మెంట్
093. హాస్పిటల్ మేనేజ్‌మెంట్
094. హోటల్ మేనేజ్‌మెంట్
095. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్
096. ఇన్స్యూరెన్స్
097. లాజిస్టిక్స్ అండ్ సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్
098. మేనేజ్‌మెంట్
099. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్
100. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్
101. కార్పొరేట్ ఇంటెలిజెన్స్
102. డిటెక్టీవ్
103. ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రీషియన్
104. ఫారిన్ లాంగ్వేజెస్
105. హోమ్ సైన్స్
106. ఇంటీరియర్ డిజైనింగ్
107. లిబరల్ స్టడీస్
108. లైబ్రరీ సైన్సెస్
109. మాంటెస్సరీ టీచింగ్
110. న్యూట్రీషియన్ అండ్ డైటెటిక్స్
111. ఫిజికల్ ఎడ్యుకేషన్
112. స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్
113. టూరిజం అండ్ ట్రావెల్.
ఇవే కాకుండా అనేక రంగాల్లో అనేక కోర్సులు ఉన్నాయి.
అయితే విద్యార్థుల అభిరుచికి తగ్గట్టుగా కోర్సలు ఎంచుకుంటే కెరీర్ బాగుంటుంది.













News
హోటళ్లపై ఆర్డీఓ మెరుపు దాడులు 34 గ్యాస్ సిలిండర్ల సీజ్
ఆదోని మండల పరిధిలోని పెద్ద హరివనం గ్రామంలో శుక్రవారం ఆదోని ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్ల అక్రమ వినియోగంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మొత్తం నాలుగు బృందాలుగా విడిపోయి నిర్వహించిన ఈ తనిఖీల్లో 15 టిఫిన్ సెంటర్లు, హోటళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
అక్రమ వినియోగంపై ‘6A’ కేసులు
తనిఖీల్లో భాగంగా గృహ అవసరాల కోసం (Domestic) కేటాయించిన 34 ఎల్పీజీ సిలిండర్లను వ్యాపార అవసరాల కోసం అక్రమంగా వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన హోటల్, టిఫిన్ సెంటర్ యజమానులపై నిత్యావసర సరుకుల చట్టం (Essential Commodities Act) సెక్షన్ 6A కింద కేసులు నమోదు చేసి, సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
అధికారుల హెచ్చరిక
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, గృహ అవసరాల సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడటం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు.
డిస్ట్రిబ్యూటర్ల లైసెన్సులు రద్దు చేస్తాం
ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు ఎవరైనా డొమెస్టిక్ సిలిండర్లను హోటళ్లకు లేదా ఇతర వాణిజ్య అవసరాలకు సరఫరా చేస్తున్నట్లు తేలితే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా లైసెన్సులను రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు.
వినియోగదారులకు సూచనలు:
- సబ్సిడీ రద్దు: ‘దీపం’ పథకం కింద ఉచితంగా పొందిన సిలిండర్లను హోటళ్లకు అమ్మితే, సదరు వినియోగదారుల సబ్సిడీతో పాటు గ్యాస్ కనెక్షన్ కూడా రద్దు చేయబడుతుంది.
- అదనపు వసూళ్లు: డెలివరీ బాయ్స్ అమర్యాదగా ప్రవర్తించినా లేదా బిల్లు కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేసినా ఫిర్యాదు చేయవచ్చు.
- ఫిర్యాదు చేయాల్సిన అధికారులు: సంబంధిత సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్, మండల తహసీల్దార్ లేదా జిల్లా పౌర సరఫరాల అధికారికి సంప్రదించాలి.
- టోల్ ఫ్రీ నంబర్: ఫిర్యాదుల కోసం 1967 నంబర్‌ను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.
News
ఆదోనిలో దొంగల హల్చల్ ఒకే రోజు మూడు కాలనీల్లో దోపిడీ!
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు కాలనీల్లో ఒకే రోజు వరుస దొంగతనాలకు పాల్పడి స్థానికులను భయాందోళనలకు గురిచేశారు. నగదు, బంగారంతో ఉడాయించారు.

కత్తి ఆంజనేయులు కాలనీ నివాసముంటున్న రాము అనే బ్యాంక్ ఉద్యోగి ఇంట్లో దొంగలు చొరబడ్డారు. హాస్పిటల్ లో తండ్రి ఆపరేషన్ కోసం తెచ్చుకున్న డబ్బులను బీరువా పగులగొట్టి 1,50,000 రూపాయల నగదు, 6 గ్రాముల బంగారం, 30 తులాల వెండి వస్తువులను అపహరించారు. పద్మావతి నగర్ లో రాజు అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు 20 వేల రూపాయల నగదు, 2 గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు బాధితుడు వాపోయాడు. సాయి నగర్ కాలనీలో కూడా దొంగలు చోరీకి ప్రయత్నించినప్పటికీ, అది విఫలమైనట్లు సమాచారం. వరుస చోరీలతో పట్టణ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దొంగలు చేతివాటం ప్రదర్శించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వరుస చోరీలపై సమాచారం అందుకున్న త్రీ టౌన్ పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.



News
సహకార ఉద్యోగుల సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం బాసట
ఆదోని, ఫిబ్రవరి 21:ఆదోనిలోని డి.సి.సి.బి (DCCB) బ్యాంక్ ఎదుట తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సహకార సంఘాల ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం శనివారం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సమ్మె శిబిరాన్ని సందర్శించిన సంఘం నాయకులు ఉద్యోగుల పోరాటానికి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె. లింగన్న, మండల కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు:
- వ్యవసాయానికి వెన్నెముక: గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి సాగు పెట్టుబడి నుంచి ఇతర సేవల వరకు ప్రాథమిక సహకార సంఘాలు ఎంతో మేలు చేస్తున్నాయని వారు కొనియాడారు.
- ప్రభుత్వ బాధ్యత: సహకార వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా, వాటిని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు గుర్తు చేశారు.
- తక్షణ పరిష్కారం: గత కొంతకాలంగా తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు శాంతియుతంగా పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. వారి న్యాయమైన కోర్కెలను వెంటనే ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సహకార సంఘాల ఉద్యోగులు, కార్మిక సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
-
News3 weeks agoవ్యాధి నయం కావడం లేదన్న బెంగతో ఆత్మహత్య
-
News3 weeks agoహత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు
-
News3 weeks agoఅదోనిలో అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తులు అరెస్ట్
-
News3 weeks agoపోగొట్టుకున్న బ్యాగ్‌ను పోలీసులు ఒకే ఒక్క గంటలో రికవరీ
-
News3 days agoహోటళ్లపై ఆర్డీఓ మెరుపు దాడులు 34 గ్యాస్ సిలిండర్ల సీజ్
-
News7 days agoఆదోనిలో దొంగల హల్చల్ ఒకే రోజు మూడు కాలనీల్లో దోపిడీ!
-
News3 weeks agoమహిళా భద్రతపై అవగాహన సదస్సు
-
News2 weeks agoసహకార ఉద్యోగుల సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం బాసట
