News
ఆకస్మిక తనిఖీ చేసిన. జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్.

కర్నూలు జిల్లా. ( ఆంధ్ర – కర్ణాటక బార్డర్ )
◆ జిల్లా సరిహద్దులో ఉన్న క్షేత్రగుడి చెక్ పోస్టును ఆకస్మిక తనిఖీ చేసిన … కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్.
◆ చెక్ పోస్టులలో అప్రమత్తంగా ఉండాలి.
◆ అక్రమ రవాణా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి.

కర్ణాటక రాష్ట్రంలో మే 10 న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం కర్నూలు జిల్లా సరిహద్దు ఆలూరు సర్కిల్ , హాలహార్వి పోలీసుస్టేషన్ పరిధిలోని క్షేత్రగుడి, చింతకుంట చెక్ పోస్టులను జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. చెక్ పోస్టులలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ గారు పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. చెక్ పోస్టులలో ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో డబ్బు , మద్యం , తదితర వస్తువులు అక్రమ రవాణా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఆదోని డిఎస్పీ వినోద్ కుమార్ , సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.


News
హొలీ పండగకు మగువలుగా ముస్తాబైన మగవారు

హొలీ పండుగ వచ్చిందంటే పిల్లలు నుండి పెద్దల వరకు రంగులు చల్లుకుని సంబరాలు జరుపుకోవడం తెలుసు కానీ ఈ గ్రామంలో మాత్రం హొలీ పండుగకు పురుషులు మహిళ వేషధారణతో రతి మన్మధులకు పూజలు చేసి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.

కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుళ్ళురు గ్రామం లో రెండు రోజులు పండుగ వాతవరణం కనిపిస్తుంది. హొలీ పండుగ రోజు పురుషులు కోకా రైకా కట్టుకోకపోతే అరిష్టం జరుగుతుందనేది వీరి నమ్మకం అందుకే మగాళ్లంతా లుంగీలు తీసేసి కట్టు బొట్టు లంగావోణి, చీరలతో సింగారించుకుని రథి మన్మథులకు పూజలు చేయడం ఔరా అనిపిస్తుంది. మగువలుగా ముస్తాబైన మగవారు పిండివంటలు నైవేద్యంగా తీసుకొని కుటుంబ సభ్యులతో కలిసి తప్పెట్లు , తాళాలతో వీధుల్లో ఆట పాటలతో అందరిని అలరిస్తూ దేవాలయం చేరుకొని రతి మన్మధులకు ప్రత్యేక పూజలు చేస్తారు. చదువుకున్న వారు కూడా తమ కోరికలు తీరడానికి కోకా రైకా కట్టి రథి మన్మధులకు మొక్కుబడి చెల్లిస్తారు. తమ గ్రామం సుభిక్షంగా ఉండాలంటే వ్యవసాయం, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తమ కోరికలు నెరవేరాలంటే మగవారు మగువ వేషం వేయాల్సిందే. లేదంటే ఏదైనా కీడు జరుగుతుందనేది గ్రామస్తుల నమ్మకం. ఈ వింత ఆచారాన్ని తిలకించడానికి పొరుగు రాష్ట్రలైన కర్ణాటక , మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల భక్తులు వస్తారు.


News
ఆదోనిలో ఘనంగా ప్రింటర్స్ డే

ఫిబ్రవరి 24 ప్రింటర్స్ డే సందర్భంగా
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం బి ఎన్ టాకీస్ వెనుక ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు దేవిశెట్టి ప్రకాష్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గోవిందు, కార్యదర్శి అబ్దుల్ రౌఫ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అందాలను మనసులోని భావాలను కళ్లకు కట్టినట్టు చూపించేది ఒక ప్రింటర్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యు లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

News
లారీ కింద పడి బాలుడు మృతి

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆదివారం ఉదయం లారీ టైర్ కింద పడి పదేళ్ల బాలుడు ఆదిత్య నారాయణ మృతి చెందాడు. ఎమ్మిగనూరు రోడ్డు కృష్ణ దేవాలయం ముందు ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఫెవరల్ పార్టీ కోసం డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి తండ్రీ కొడుకు బైక్ పై వెళుతుండగా వేగంగా దూసుకు వచ్చిన లారీని తప్పించబోయి తండ్రి కొడుకులు కింద పడ్డారు కొడుకు ఆదిత్యనారాయణ పై లారీ ఎక్కడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి గురురాజు మరోవైపు పడడంతో స్వల్ప గాయాలతో క్షేమంగా ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
News3 weeks ago
లారీ కింద పడి బాలుడు మృతి
-
News4 weeks ago
వేరుశనగ పొట్టు యంత్రంలో పడి కార్మికుడు మృతి
-
News4 weeks ago
స్టేట్ బ్యాంకు ఉద్యోగస్తుల నిరసన
-
News4 weeks ago
ఇమామ్, మౌజన్ లకు పెండింగ్ వేతనాలు విడుదల
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business3 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర