Connect with us

News

నకిలీ పత్రాలు పెట్టండి…. కోట్ల ఆస్తులు సొంతం చేసుకోండి

Published

on

నకిలీ పత్రాలు పెట్టండి…. కోట్ల ఆస్తులు సొంతం చేసుకోండి అనే చందంగా మారింది ఆదోని సబ్ రిజిస్టర్ కార్యలయం.. ఒకటి మరవక ముందే మరొకటి నకిలీ పత్రాల భాగవతం బయటపడడంతో స్థానిక ప్రజల్లో ఆందోళన మొదలైంది.. ఇంకా ఇలా ఎన్ని జరిగాయి అని ఆదోని ప్రజలు చర్చించుకుంటున్నారు.

సబ్ రిజిస్టర్ కార్యాలయంలో బాధితులు
వివరాల కోసం పూర్తి వీడియో

కర్నూలు జిల్లా ఆదోనిలో కోట్ల విలువ చేసే భూమి అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని బాధితుడు యగ్గటి ఈశ్వరప్ప సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట కూర్చొని ఆందోళన చేపట్టారు. బతికున్న వ్యక్తికి మృతి చెందినట్లు ఫేక్  సర్టిఫికెట్లు సృష్టించి అముదాల భాస్కర్ అనె వ్యక్తి కోట్ల భూమిని  చాకలి ఇరన్న అనే వ్యక్తికి జి.పి. (జండ్రల్ పవర్ ఆఫ్ అటార్నీ) ఎలా చేసుకున్నాడని సబ్ రిజిస్టర్ ను బాధితులు యగ్గటి ఈశ్వరప్ప , కుమారులు మోహన్, సునిల్ నిలదీశారు. అనంతరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో యగ్గటి ఈశ్వరప్ప,, సబ్ రిజిస్టర్ హాజీమియా ఫిర్యాదు చేశారు.

జిపి చేసే స్థలం

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ఎగటి ఈశ్వరప్పకు ఇద్దరు కుమారులు మోహన్ సునీల్ బండిగిరి గ్రామ పంచాయతీ పరిధిలో 7 ఎకరాల 41 సెంట్లు భూమి ఉంది. అందులో 90 సెంట్లు నేషనల్ హైవేకి పోగా మిగిలిన ఆరు ఎకరాల 51 సెంట్లు భూమి మిగిలింది ఆ భూమిపై కన్నేషన్ అక్రమార్కులు ఆముదాల భాస్కర్ అనే వ్యక్తి తన పేరు ముందు ఎగటి అని జోడించి ఎగటి ఆముదాల భాస్కర్ గా పేరు మార్చుకుని తండ్రి ఎగటి ఈశ్వరప్ప చనిపోయాడని నకిలీ డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ సర్టిఫికెట్ సృష్టించి డిసెంబర్ 31వ తేదీ చాకలి ఇరన్న అనే వ్యక్తి కి జి.పి. (జండ్రల్ పవర్ ఆఫ్ అటార్నీ) చేసి రిజిస్ట్రేషన్ చేశారు. జనవరి నాలుగవ తేదీ ఎగటి ఈశ్వరప్పకు సమాచారం రావడంతో సబ్ రిజిస్టర్ నిలదీశారు ఆఫీస్ ముందు బెటాయించి ఆందోళన చేశారు. అనంతరం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆరు మందిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..

నకిలీ ఫ్యామిలీ సర్టిఫికెట్
నకిలీ డెత్ సర్టిఫికెట్

News

సహకార ఉద్యోగుల సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం బాసట

Published

on

ఆదోని, ఫిబ్రవరి 21:ఆదోనిలోని డి.సి.సి.బి (DCCB) బ్యాంక్ ఎదుట తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సహకార సంఘాల ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం శనివారం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సమ్మె శిబిరాన్ని సందర్శించిన సంఘం నాయకులు ఉద్యోగుల పోరాటానికి సంఘీభావం తెలిపారు.

సభలో మాట్లాడుతున్న వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు లింగన్న

ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె. లింగన్న, మండల కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు:

  • వ్యవసాయానికి వెన్నెముక: గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి సాగు పెట్టుబడి నుంచి ఇతర సేవల వరకు ప్రాథమిక సహకార సంఘాలు ఎంతో మేలు చేస్తున్నాయని వారు కొనియాడారు.
  • ప్రభుత్వ బాధ్యత: సహకార వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా, వాటిని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు గుర్తు చేశారు.
  • తక్షణ పరిష్కారం: గత కొంతకాలంగా తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు శాంతియుతంగా పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. వారి న్యాయమైన కోర్కెలను వెంటనే ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్ చేశారు.
సభలో మాట్లాడుతున్న వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు లింగన్న

ఈ కార్యక్రమంలో సహకార సంఘాల ఉద్యోగులు, కార్మిక సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

News

పోగొట్టుకున్న బ్యాగ్ను పోలీసులు ఒకే ఒక్క గంటలో రికవరీ

Published

on

ఆదోని, ఫిబ్రవరి 18:

ప్రయాణంలో అజాగ్రత్తగా వదిలేసిన లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఆదోని వన్ టౌన్ పోలీసులు కేవలం ఒకే ఒక్క గంటలో రికవరీ చేసి బాధితురాలికి అప్పగించారు. పోలీసుల వేగవంతమైన స్పందనపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

అసలేం జరిగిందంటే?  కౌతాలం నుంచి ఆదోనికి ఆర్టీసీ బస్సులో వచ్చిన ఓ మహిళ, విశాల్ మార్ట్ వద్ద దిగుతూ తన బ్యాగును బస్సులోనే మరిచిపోయింది. ఆ బ్యాగులో 6 లక్షల రూపాయల విలువైన 4 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. అయితే, ఆ తొందరలో తన వెంట తెచ్చుకున్న బ్యాగును బస్సులోనే మరిచిపోయారు. కొద్దిసేపటి తర్వాత బ్యాగు గుర్తుకు రావడంతో హుటాహుటిన బస్టాండ్‌కు చేరుకుని డ్రైవర్‌ను సంప్రదించారు. బస్సులో వెతికినప్పటికీ బ్యాగు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన బాధితురాలు సాయంత్రం 3:30 గంటలకు ఆదోని వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్ గారికి ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు.. బాధితురాలి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన పోలీసులు బస్సు డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు విచారణ చేపట్టారు. పలు ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గాలింపు చేపట్టారు. సాయంత్రం 4:30 గంటలకు పోగొట్టుకున్న సొత్తును తిరిగి పొందిన బాధితురాలు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

Continue Reading

News

నాటు సారా స్థావరంపై పోలీసుల దాడి

Published

on

ఆదోని రూరల్, ఫిబ్రవరి 18:

కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా ఆదోని డీఎస్పీ శ్రీ హేమలత సూచనల మేరకు, రూరల్ సీఐ నల్లప్ప పర్యవేక్షణలో బుధవారం పెద్దతుంబలం పోలీసులు భారీ దాడులు నిర్వహించారు.

ఘటన వివరాలు:

​పెద్దతుంబలం ఎస్ఐ విద్యా శ్రీ, తన సిబ్బంది రంగస్వామి (PC-3603), రామకృష్ణ (PC-3637)లతో కలిసి దొడ్డనగిరి గ్రామ శివార్లలోని సిద్ధాపురం ఆంజనేయస్వామి గుడి సమీపంలో ఉన్న గుట్టల వద్ద తనిఖీలు చేపట్టారు. అక్కడ గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న నాటు సారా బట్టిని పోలీసులు గుర్తించారు. పోలీసుల రాకను గమనించిన నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు.

భారీగా ఊట ధ్వంసం:

​పోలీసులు సారా బట్టి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అక్కడ నిల్వ ఉంచిన ఊటను తక్షణమే ధ్వంసం చేశారు. అలాగే, ప్లాస్టిక్ క్యాన్లలో నిల్వ ఉంచిన 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

నిందితుడి గుర్తింపు:

​పోలీసుల ప్రాథమిక విచారణలో, సారా బట్టి నిర్వహిస్తున్న వ్యక్తి ఆదోని పట్టణానికి చెందిన నాగరాజు కుమారుడు బోయ శివగా తేలింది. స్థానిక పొలాల యజమానుల నుంచి సేకరించిన సమాచారం మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విద్యా శ్రీ తెలిపారు. అక్రమ మద్యం తయారీ మరియు రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

Continue Reading

Trending