News
రైతు కంటతడి పెడుతున్నాడు
కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్ యాడ్ లో రైతులకు యూరియా అందించాలి అలాగే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు డీ ఎస్ ప్ విద్యార్థి సంఘం నాయకులు. అనంతరం విలేకరుల సమావేశంలో DSF జిల్లా అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ రైతులు ఈరన్న, సిద్ధ లింగ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాలలో మండల కేంద్రాల్లో రైతులకు యూరియా అందక యూరియా కోసం షాపుల దగ్గర గంటల తరబడి వేచి చూస్తున్న పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి వెన్నుముక అయినటువంటి రైతన్నకు రాష్ట్రంలో కష్టాలు వస్తున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం చూపించడం సరైనది కాదని అన్నారు. ఆదోని సెకండ్ ముంబై గా పేరు పొందింది అటువంటి ఆదోనిలోనే ఇవాళ రైతులకు గిట్టుబాటు ధర లేక రైతులు కంటతడి పెడుతున్న పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇప్పటికైనా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి రైతులను ఆదుకోవాలి అలాగే రైతులకు యూరియా అందించాలి రైతులకు ఏ కష్టం రాకుండా చూడాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతులు ఈరన్న సిద్ధ లింగ, వర్మ మల్లప్ప మరియు DSF నాయకులు నరసింహులు మురళి, అరవింద్ హరి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
News
హోటళ్లపై ఆర్డీఓ మెరుపు దాడులు 34 గ్యాస్ సిలిండర్ల సీజ్
ఆదోని మండల పరిధిలోని పెద్ద హరివనం గ్రామంలో శుక్రవారం ఆదోని ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్ల అక్రమ వినియోగంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మొత్తం నాలుగు బృందాలుగా విడిపోయి నిర్వహించిన ఈ తనిఖీల్లో 15 టిఫిన్ సెంటర్లు, హోటళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
అక్రమ వినియోగంపై ‘6A’ కేసులు
తనిఖీల్లో భాగంగా గృహ అవసరాల కోసం (Domestic) కేటాయించిన 34 ఎల్పీజీ సిలిండర్లను వ్యాపార అవసరాల కోసం అక్రమంగా వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన హోటల్, టిఫిన్ సెంటర్ యజమానులపై నిత్యావసర సరుకుల చట్టం (Essential Commodities Act) సెక్షన్ 6A కింద కేసులు నమోదు చేసి, సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
అధికారుల హెచ్చరిక
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, గృహ అవసరాల సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడటం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు.
డిస్ట్రిబ్యూటర్ల లైసెన్సులు రద్దు చేస్తాం
ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు ఎవరైనా డొమెస్టిక్ సిలిండర్లను హోటళ్లకు లేదా ఇతర వాణిజ్య అవసరాలకు సరఫరా చేస్తున్నట్లు తేలితే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా లైసెన్సులను రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు.
వినియోగదారులకు సూచనలు:
- సబ్సిడీ రద్దు: ‘దీపం’ పథకం కింద ఉచితంగా పొందిన సిలిండర్లను హోటళ్లకు అమ్మితే, సదరు వినియోగదారుల సబ్సిడీతో పాటు గ్యాస్ కనెక్షన్ కూడా రద్దు చేయబడుతుంది.
- అదనపు వసూళ్లు: డెలివరీ బాయ్స్ అమర్యాదగా ప్రవర్తించినా లేదా బిల్లు కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేసినా ఫిర్యాదు చేయవచ్చు.
- ఫిర్యాదు చేయాల్సిన అధికారులు: సంబంధిత సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్, మండల తహసీల్దార్ లేదా జిల్లా పౌర సరఫరాల అధికారికి సంప్రదించాలి.
- టోల్ ఫ్రీ నంబర్: ఫిర్యాదుల కోసం 1967 నంబర్‌ను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.
News
ఆదోనిలో దొంగల హల్చల్ ఒకే రోజు మూడు కాలనీల్లో దోపిడీ!
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు కాలనీల్లో ఒకే రోజు వరుస దొంగతనాలకు పాల్పడి స్థానికులను భయాందోళనలకు గురిచేశారు. నగదు, బంగారంతో ఉడాయించారు.

కత్తి ఆంజనేయులు కాలనీ నివాసముంటున్న రాము అనే బ్యాంక్ ఉద్యోగి ఇంట్లో దొంగలు చొరబడ్డారు. హాస్పిటల్ లో తండ్రి ఆపరేషన్ కోసం తెచ్చుకున్న డబ్బులను బీరువా పగులగొట్టి 1,50,000 రూపాయల నగదు, 6 గ్రాముల బంగారం, 30 తులాల వెండి వస్తువులను అపహరించారు. పద్మావతి నగర్ లో రాజు అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు 20 వేల రూపాయల నగదు, 2 గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు బాధితుడు వాపోయాడు. సాయి నగర్ కాలనీలో కూడా దొంగలు చోరీకి ప్రయత్నించినప్పటికీ, అది విఫలమైనట్లు సమాచారం. వరుస చోరీలతో పట్టణ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దొంగలు చేతివాటం ప్రదర్శించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వరుస చోరీలపై సమాచారం అందుకున్న త్రీ టౌన్ పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.



News
సహకార ఉద్యోగుల సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం బాసట
ఆదోని, ఫిబ్రవరి 21:ఆదోనిలోని డి.సి.సి.బి (DCCB) బ్యాంక్ ఎదుట తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సహకార సంఘాల ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం శనివారం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సమ్మె శిబిరాన్ని సందర్శించిన సంఘం నాయకులు ఉద్యోగుల పోరాటానికి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె. లింగన్న, మండల కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు:
- వ్యవసాయానికి వెన్నెముక: గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి సాగు పెట్టుబడి నుంచి ఇతర సేవల వరకు ప్రాథమిక సహకార సంఘాలు ఎంతో మేలు చేస్తున్నాయని వారు కొనియాడారు.
- ప్రభుత్వ బాధ్యత: సహకార వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా, వాటిని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు గుర్తు చేశారు.
- తక్షణ పరిష్కారం: గత కొంతకాలంగా తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు శాంతియుతంగా పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. వారి న్యాయమైన కోర్కెలను వెంటనే ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సహకార సంఘాల ఉద్యోగులు, కార్మిక సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
-
News3 weeks agoవ్యాధి నయం కావడం లేదన్న బెంగతో ఆత్మహత్య
-
News3 weeks agoహత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు
-
News3 weeks agoఅదోనిలో అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తులు అరెస్ట్
-
News3 weeks agoపోగొట్టుకున్న బ్యాగ్‌ను పోలీసులు ఒకే ఒక్క గంటలో రికవరీ
-
News3 days agoహోటళ్లపై ఆర్డీఓ మెరుపు దాడులు 34 గ్యాస్ సిలిండర్ల సీజ్
-
News7 days agoఆదోనిలో దొంగల హల్చల్ ఒకే రోజు మూడు కాలనీల్లో దోపిడీ!
-
News3 weeks agoమహిళా భద్రతపై అవగాహన సదస్సు
-
News2 weeks agoసహకార ఉద్యోగుల సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం బాసట
