Connect with us

News

కర్ణాటకలో తుది దశకు చేరిన ఎన్నికల ప్రచారం

Published

on

◆ కర్ణాటకలో తుది దశకు చేరిన ఎన్నికల ప్రచారం
◆ పోటాపోటీగా ప్రధాన పార్టీల హామీలు
◆ మే 10న పోలింగ్ మే 13న ఓట్ల లెక్కింపు
◆ ఒపీనియన్ పోల్స్ లో కాంగ్రెస్ ముందంజ
◆ ఒక నావాలో ఇద్దరు కెప్టెన్లు

కర్ణాటక ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. పోటాపోటీగా మేనిఫెస్టో విడుదల చేస్తున్న ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ బిజెపి తరఫున అగ్ర నేతలు రాహుల్ ప్రియాంక గాంధీ మోడీ అమిత్ షా మూల మూలన తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు 224 స్థానాలు ఉన్న కర్ణాటక అసెంబ్లీకి ఈనెల 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి మే 13వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది ఏ పార్టీ అయితే 113 సీట్లు రాబట్టుకుంటుందో అది కర్ణాటక పీఠాన్ని చేజిక్కించుకుంటుంది.

ఈసారి కన్నడ ఓటర్లు కాంగ్రెస్కు పట్టం కడుతున్నట్లు అనేక ఒపీనియన్ పూల్స్ చెప్తున్నాయి. అధికారంలో ఉన్న బిజెపికి 79 నుంచి 49 స్థానాలు రావచ్చుని ఒపీనియన్ పూల్స్ చెప్తున్నాయి. జెడిఎస్ కు 24 నుంచి 34 సీట్లు కె పరిమితమవుతుందని అంటున్నారు.

ఇంకా 6 రోజుల్లో పోలింగ్ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా తన సీఎం బెట్టిని ప్రకటించలేదు మాజీ సీఎం సిద్ధరామయ్య కేపీసీసీ అధ్యక్షుడు శివకుమార్ రేసులో ఉన్నట్టు తెలుస్తుంది

ప్రజాధరణలో ముందంజలో ఉన్న సిద్ధరామయ్య 2013 నుంచి 2018 వరకు కర్ణాటక సీఎం కొనసాగారు గడిచిన 40 ఏళ్లలో పూర్తి ఐదేళ్ల పదవీకాలంలో ఉన్న తొలి సీఎం గా సిద్ధార్థ రామయ్య ఉన్నారు కర్ణాటకలో ఈయన బాగా ఫేమస్ 8సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఒకప్పుడు జిడిఎస్ అధినేత హెచ్డి దేవ గోడకు కుడి భుజం లాంటివాడు దేవగూడ కుమారుడు కుమారస్వామిని రాజకీయ వారసుడిగా ప్రకటించటంతో ఆయనతో విభేదించి 2005లో కాంగ్రెస్ పార్టీలో చేరారు 2010లో బెంగళూరు నుంచి బళ్లారి వరకు పాదయాత్ర తీసి కాంగ్రెస్లో జోష్ నింపారు.


మరోవైపు కెపిసిసి అధ్యక్షుడు డీకే శివకుమార్ సీఎం పదవికి పోటీ పడుతున్నారు. యూత్ కాంగ్రెస్ కార్యదర్శి నుంచి కెపిసిసి అధ్యక్షుడిగా ఎదిగారు అయన అత్యంత సంపన్నుడు శివకుమార్ పార్టీని చాలాసార్లు కష్టాల నుంచి గట్టెక్కించిన వ్యక్తి. ఆయన బెంగళూరు సిటి కనకాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. గతంలో రెండు సార్లు మంత్రిగా పని చేశారు.

కాంగ్రెస్ లో గట్టి పట్టున్న ఇద్దరు నాయకులు సీఎం రేస్ లో ఉన్నట్లు బహిరంగంగానే చెబుతున్నారు. తమ పార్టీలో ఎవరైనా సీఎం పదవికి పోటీ పడవచ్చుని బహిరంగం గానే సిద్ధరామయ్య కూడా చెప్పారు. ఈ ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న పోటీ చూస్తే కాంగ్రెస్లో చీలికలు వస్తాయని స్థానికులు విమర్శలు గుపిస్తున్నారు. కానీ సిద్ధరామయ్య శివకుమార్ ఇద్దరు కలిసి పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. సిద్ధరామయ్య కు పార్టీపై ఉన్న పట్టు క్లీన్ ఇమేజ్ ఉన్నట్లు అందులో మాస్ ఫాలోయింగ్ ఉండడంతో అతనికి ఎక్కువ ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు కానీ శివకుమార్ కు ఆర్థిక అవకతవకలు మనీ లాంటి అవినీతి ఆరోపణ వెంటాడుతున్నాయి.

ప్రజా తీర్పు ఎటువైపు ఉందనేది ఈనెల 13వ తేదీ తెలియనుంది.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఆదోని జిల్లా కోసం ఐదు నియోజకవర్గ లు బంద్

Published

on

ఆదోని జిల్లా చేయాలనే డిమాండ్‌కు మద్దతుగా JAC (జాయింట్ యాక్షన్ కమిటీ) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆదోని బందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా 𝐘𝐒𝐑𝐂𝐏 రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మునిసిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మీడియా తో మాట్లాడుతూ పార్టీ లకు అతీతంగా, కుల, మత భేదాలు లేకుండా ఆదోని జిల్లా సాధన లక్ష్యంగా ప్రజలంతా ఏకమై ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. “ఆదోని జిల్లా – మన హక్కు” అనే నినాదంతో బందు కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించారని అన్నారు.

ఆర్టీసీ డిపో ముందు నిరసన తెలుపుతున్న వైఎస్ఆర్సిపి నాయకులు
బందులో పాల్గొన్న వైఎస్ఆర్ సీపీ నాయకులు
Continue Reading

News

ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

Published

on

ఆదోని 09-01-2026:

కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు

09 01 26 రైతు బజార్ ధరల పట్టిక
అడ్వర్టైజ్మెంట్
Continue Reading

News

వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక

Published

on

వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్‌ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.

Continue Reading

Trending