News
కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్

కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పరిధిలోని పర్వతాపురం రోడ్డు ఈఎస్ఐ హాస్పిటల్ సమీపంలో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరు అమరావతి నగర్ కు చెందిన బోయ లక్ష్మీనారాయణ(37), కర్ణాటక రాష్ట్రానికి చెందిన తలవార బసవరాజు(21) ని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 288 Original Choice Deluxe Whishy 90ml టెట్రా ప్యాకెట్లను మరియు రెండు మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకొన్నారు. వారిపై P.S.Cr.NO.43/2023 U/S,34(a)AP
Exice Act నమోదు చేసి ముద్దాయిలను రిమాండ్కు తరలించారు. ఈ దాడులలో S.I K.P. ప్రహల్లాద మరియు సిబ్బంది H.C మద్దిలేటి,PC’c మధు నాగరాజు రంగస్వామి పాల్గొన్నారు.
News
అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలో ప్రై మినిస్టర్ రైసింగ్ ఆఫ్ స్కూల్స్
సెంట్రల్ స్కీం ద్వారా 63 లక్షలతో ZP పాఠాశాల అదనపు గదులకు కేంద్ర ప్రభుత్వ NREGS పథకం ద్వారా 10 లక్షలతో గ్రామములో CC రోడ్డు పనులను ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి ప్రత్యేక పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ పెద్ద తుంబలం గ్రామంలోనే కాకుండా మండలంలో అన్ని గ్రామాల్లో స్కూలకు అదనపు గదులకు పనులు త్వరలో చేపడతామని స్కూళ్లలో విద్యార్థుల అధికంగా ఉండడంతో టీచర్లు లేరని దానికోసం ప్రభుత్వంతో మాట్లాడి విద్య వాలంటీర్లు టీచర్లు వచ్చేలా ప్రయత్నం చేస్తానని తెలిపారు.

News
హెచ్ పి గ్యాస్ సిలిండర్లు సీజ్

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద హరివన గ్రామంలో కర్ణాటక నుంచి హెచ్.పీ గ్యాస్ సిలిండర్లను తెచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తుండగా రెవెన్యూ అధికారులు పట్టుకొని 50 సిలిండర్లను సీజ్ చేశారు. కర్ణాటక నుంచి తెచ్చి గ్యాస్ సిలిండర్లను డిస్ట్రిబ్యూట్ చేయొద్దని ఎన్నిసార్లు హెచ్చరించిన వినకపోవడంతో రెవెన్యూ అధికారులకు పోలీసులకు డిస్ట్రిబ్యూటర్ ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులు గ్యాస్ సిలిండర్లను సీజ్ చేసినట్లు తెలిపారు.
News
నలుదిక్కుల ప్రధాన ముఖ్యమైన వార్తలు

◆ ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు పై బిజెపి కసరత్తు, అమిత్ షా నివాసంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై మీటింగ్.. ప్రధాని విదేశీ పర్యటన తర్వాతే కొత్త సీఎం ప్రమాణస్వీకారం ఉండే అవకాశం..
◆ కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య లోపారిక ఒప్పందం జరిగిందన బండి సంజయ్..
అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పోటీ చేయడం లేదని ఆరోపణ.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో బిజెపి గెలుపు ఖాయం అన్న ధీమా..
◆ బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందన్న హరీష్ రావు, కామారెడ్డి లో ఇచ్చిన డిక్లరేషన్ ను అమలు చేయాలని డిమాండ్.. క్యాబినెట్లో 42 శాతం పదవులు బీసీలకే ఇవ్వాలన్న హరీష్ రావు..
◆ వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం.. ఏపీ అంటే రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ మాత్రమే కాదన్న నేతలు అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం చంద్రబాబు దృష్టిసాదించాలని డిమాండ్..
◆ రేపు సిఐడి విచారణకు హాజరు కాలేనన్న రామ్ గోపాల్ వర్మ, స్వారీ మూవీ ప్రమోషన్ లో బిజీగా ఉండడంతో రాలేనని అధికారులకు సమాచారం. ఎనిమిది వారాల తర్వాత డేట్ ఇస్తే హాజరవుతానని సిఐడి కి తెలిపిన ఆర్జీవి..
◆ సంగారెడ్డి జిల్లా ముద్దాయి పేటలో చెరుకు తోట దగ్ధం, 14 ఎకరాల్లో పంట సాగు చేస్తున్న రైతుకు తీవ్ర నష్టం. ఎనిమిది లక్షలు నష్టం జరిగిందని లింగయ్య తీవ్ర ఆవేదన..
◆ మణిపూర్ సీఎం బిరేంద్ర సింగ్ రాజీనామా, గవర్నర్కు రాజీరామా లేఖ అందజేత, బీరన్ సింగ్ పై అవిశ్వాసం పెట్టినందుకు సిద్ధమైన కాంగ్రెస్, తాజా రాజకీయాల పరిణామంతో సీఎం పదవికి రిజైన్..
◆ రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది, కేంద్రం ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ విమర్శలు.. దేశ రక్షణ కోసం పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపు.. వైనాడ్ నియోజకవర్గం లో బూత్ స్థాయి నేతలతో ప్రియాంక భేటీ..
◆ ఆర్జికర్ ఆసుపత్రిలో అత్యాచార ఘటన పై కొనసాగుతున్న నిరసనలు.. పెద్ద ఎత్తున ర్యాలీ తీసిన జూనియర్ డాక్టర్లు.. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్..
◆ తమిళనాడులోని తిరుచిలో అలరిస్తున్న బర్డ్ పార్క్ సందర్భంగా అలరిస్తున్న ఆస్టిన్ కోళ్లు కొంగలు
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business3 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business3 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business3 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business1 week ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business3 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర