Connect with us

News

కర్ణాటకలో తుది దశకు చేరిన ఎన్నికల ప్రచారం

Published

on

◆ కర్ణాటకలో తుది దశకు చేరిన ఎన్నికల ప్రచారం
◆ పోటాపోటీగా ప్రధాన పార్టీల హామీలు
◆ మే 10న పోలింగ్ మే 13న ఓట్ల లెక్కింపు
◆ ఒపీనియన్ పోల్స్ లో కాంగ్రెస్ ముందంజ
◆ ఒక నావాలో ఇద్దరు కెప్టెన్లు

కర్ణాటక ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. పోటాపోటీగా మేనిఫెస్టో విడుదల చేస్తున్న ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ బిజెపి తరఫున అగ్ర నేతలు రాహుల్ ప్రియాంక గాంధీ మోడీ అమిత్ షా మూల మూలన తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు 224 స్థానాలు ఉన్న కర్ణాటక అసెంబ్లీకి ఈనెల 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి మే 13వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది ఏ పార్టీ అయితే 113 సీట్లు రాబట్టుకుంటుందో అది కర్ణాటక పీఠాన్ని చేజిక్కించుకుంటుంది.

ఈసారి కన్నడ ఓటర్లు కాంగ్రెస్కు పట్టం కడుతున్నట్లు అనేక ఒపీనియన్ పూల్స్ చెప్తున్నాయి. అధికారంలో ఉన్న బిజెపికి 79 నుంచి 49 స్థానాలు రావచ్చుని ఒపీనియన్ పూల్స్ చెప్తున్నాయి. జెడిఎస్ కు 24 నుంచి 34 సీట్లు కె పరిమితమవుతుందని అంటున్నారు.

ఇంకా 6 రోజుల్లో పోలింగ్ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా తన సీఎం బెట్టిని ప్రకటించలేదు మాజీ సీఎం సిద్ధరామయ్య కేపీసీసీ అధ్యక్షుడు శివకుమార్ రేసులో ఉన్నట్టు తెలుస్తుంది

ప్రజాధరణలో ముందంజలో ఉన్న సిద్ధరామయ్య 2013 నుంచి 2018 వరకు కర్ణాటక సీఎం కొనసాగారు గడిచిన 40 ఏళ్లలో పూర్తి ఐదేళ్ల పదవీకాలంలో ఉన్న తొలి సీఎం గా సిద్ధార్థ రామయ్య ఉన్నారు కర్ణాటకలో ఈయన బాగా ఫేమస్ 8సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఒకప్పుడు జిడిఎస్ అధినేత హెచ్డి దేవ గోడకు కుడి భుజం లాంటివాడు దేవగూడ కుమారుడు కుమారస్వామిని రాజకీయ వారసుడిగా ప్రకటించటంతో ఆయనతో విభేదించి 2005లో కాంగ్రెస్ పార్టీలో చేరారు 2010లో బెంగళూరు నుంచి బళ్లారి వరకు పాదయాత్ర తీసి కాంగ్రెస్లో జోష్ నింపారు.


మరోవైపు కెపిసిసి అధ్యక్షుడు డీకే శివకుమార్ సీఎం పదవికి పోటీ పడుతున్నారు. యూత్ కాంగ్రెస్ కార్యదర్శి నుంచి కెపిసిసి అధ్యక్షుడిగా ఎదిగారు అయన అత్యంత సంపన్నుడు శివకుమార్ పార్టీని చాలాసార్లు కష్టాల నుంచి గట్టెక్కించిన వ్యక్తి. ఆయన బెంగళూరు సిటి కనకాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. గతంలో రెండు సార్లు మంత్రిగా పని చేశారు.

కాంగ్రెస్ లో గట్టి పట్టున్న ఇద్దరు నాయకులు సీఎం రేస్ లో ఉన్నట్లు బహిరంగంగానే చెబుతున్నారు. తమ పార్టీలో ఎవరైనా సీఎం పదవికి పోటీ పడవచ్చుని బహిరంగం గానే సిద్ధరామయ్య కూడా చెప్పారు. ఈ ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న పోటీ చూస్తే కాంగ్రెస్లో చీలికలు వస్తాయని స్థానికులు విమర్శలు గుపిస్తున్నారు. కానీ సిద్ధరామయ్య శివకుమార్ ఇద్దరు కలిసి పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. సిద్ధరామయ్య కు పార్టీపై ఉన్న పట్టు క్లీన్ ఇమేజ్ ఉన్నట్లు అందులో మాస్ ఫాలోయింగ్ ఉండడంతో అతనికి ఎక్కువ ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు కానీ శివకుమార్ కు ఆర్థిక అవకతవకలు మనీ లాంటి అవినీతి ఆరోపణ వెంటాడుతున్నాయి.

ప్రజా తీర్పు ఎటువైపు ఉందనేది ఈనెల 13వ తేదీ తెలియనుంది.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

హొలీ పండగకు మగువలుగా ముస్తాబైన మగవారు

Published

on

హొలీ పండుగ వచ్చిందంటే  పిల్లలు నుండి పెద్దల వరకు రంగులు చల్లుకుని సంబరాలు జరుపుకోవడం తెలుసు కానీ ఈ గ్రామంలో మాత్రం హొలీ పండుగకు పురుషులు మహిళ వేషధారణతో  రతి మన్మధులకు పూజలు చేసి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.

పిండివంటలు నైవేద్యంగా తీసుకొని కుటుంబ సభ్యులతో పూజకు వెళ్తున్న ఫోటో

కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుళ్ళురు గ్రామం లో  రెండు రోజులు పండుగ వాతవరణం కనిపిస్తుంది. హొలీ పండుగ రోజు పురుషులు కోకా రైకా కట్టుకోకపోతే అరిష్టం జరుగుతుందనేది వీరి నమ్మకం అందుకే మగాళ్లంతా లుంగీలు తీసేసి కట్టు బొట్టు లంగావోణి,  చీరలతో  సింగారించుకుని రథి మన్మథులకు పూజలు చేయడం  ఔరా అనిపిస్తుంది. మగువలుగా ముస్తాబైన మగవారు పిండివంటలు నైవేద్యంగా తీసుకొని కుటుంబ సభ్యులతో కలిసి తప్పెట్లు , తాళాలతో వీధుల్లో ఆట పాటలతో అందరిని అలరిస్తూ దేవాలయం చేరుకొని రతి మన్మధులకు ప్రత్యేక పూజలు చేస్తారు.  చదువుకున్న వారు కూడా తమ కోరికలు తీరడానికి  కోకా రైకా కట్టి రథి మన్మధులకు మొక్కుబడి చెల్లిస్తారు. తమ గ్రామం సుభిక్షంగా ఉండాలంటే వ్యవసాయం, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తమ కోరికలు నెరవేరాలంటే మగవారు మగువ వేషం వేయాల్సిందే. లేదంటే ఏదైనా కీడు జరుగుతుందనేది గ్రామస్తుల నమ్మకం. ఈ వింత ఆచారాన్ని తిలకించడానికి పొరుగు రాష్ట్రలైన కర్ణాటక , మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల భక్తులు వస్తారు.

కోకా రైకా కట్టి రథి మన్మధులకు మొక్కుబడి చెల్లిస్తాన్న ఫోటో
రథి మన్మధుల దేవుళ్ల
Continue Reading

News

ఆదోనిలో ఘనంగా ప్రింటర్స్ డే

Published

on

ఫిబ్రవరి 24 ప్రింటర్స్ డే సందర్భంగా
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం బి ఎన్ టాకీస్ వెనుక ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు దేవిశెట్టి ప్రకాష్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గోవిందు, కార్యదర్శి అబ్దుల్ రౌఫ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అందాలను మనసులోని భావాలను కళ్లకు కట్టినట్టు చూపించేది ఒక ప్రింటర్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యు లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

జెండాను ఆవిష్కరిస్తున్న గౌరవాధ్యక్షులు దేవిశెట్టి ప్రకాష్
Continue Reading

News

లారీ కింద పడి బాలుడు మృతి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆదివారం ఉదయం లారీ టైర్ కింద పడి పదేళ్ల బాలుడు ఆదిత్య నారాయణ మృతి చెందాడు.  ఎమ్మిగనూరు రోడ్డు కృష్ణ దేవాలయం ముందు ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఫెవరల్ పార్టీ కోసం డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి తండ్రీ కొడుకు బైక్ పై వెళుతుండగా వేగంగా దూసుకు వచ్చిన లారీని తప్పించబోయి తండ్రి కొడుకులు కింద పడ్డారు కొడుకు ఆదిత్యనారాయణ పై లారీ ఎక్కడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి గురురాజు మరోవైపు పడడంతో స్వల్ప గాయాలతో క్షేమంగా ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Continue Reading

Trending