News
కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదం, ఈ రూట్‌లో నడిచే 43 రైళ్ల రద్దు

షాలిమర్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్ప్రెస్ ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఆగి ఉన్న గూడ్స్ రైలు ఢీకొట్టి పట్టాలు తప్పిన ప్రమాదంలో మృతుల సంఖ్య 237కు చేరింది. 1000 మందికి పైగా గాయాలు. సిగ్నల్ ఫెయిల్ అయినందుకు ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించిన అధికారులు.
ఒడిశా రైలు ప్రమాద బాధితులకు కేంద్రం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఆర్థికసాయం, తీవ్రంగా గాయపడ్డవారికి రూ. 2 లక్షలు, స్వల్పంగా గాయాలపాలైనవారికి రూ. 50 వేలు ఆర్థిక సాయం ప్రకటించింది.
కోరమాండల్ ప్రమాదం : హెల్ప్‌లైన్ నెంబర్లు…రద్దైన రైళ్ల వివరాలు ఇవే
మానవ తప్పిదమే వందల మంది ప్రాణాలను బలిగొందా?. ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం. ఇటీవల కాలంలో మన దేశంలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం. మూడు రైళ్లు ఒకదాన్ని మరొకటి ఢీకొనడంతో ప్రమాద తీవ్రత వర్ణనాతీతంగా పెరిగింది. కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాద ఘటనకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది.
*రైల్వేస్టేషన్లు :
విజయవాడలో 0866 2576924,
రాజమండ్రిలో 0883 2420541,
రేణిగుంటలో 9949198414,
తిరుపతిలో 7815915571,
నెల్లూరులో 0861 2342028,
సామర్లకోటలో 7780741268,
ఒంగోలులో 7815909489,
గూడూరులో 08624250795,
ఏలూరులో 08812232267
నంబర్లను అందుబాటులో ఉంచింది. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో 040 27788516 నంబర్‌ను ఏర్పాటు చేసింది. రైలు ప్రమాదంలో చిక్కుకున్న తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమాచారం తెలుసుకోవడానికి ఈ నంబర్లకు ఫోన్ చేయొచ్చని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో వెల్లడించింది.
అలాగే హౌరాలో 033 2638227,
ఖరగ్‌పూర్‌లో 8972073925, 9332392339,
బాలాసోర్‌లో 8249591559, 7978418322, 858 5039521,
షాలిమార్‌లో 9903370746,
సంత్రగాచిలో 8109289460, 8340649469 నంబర్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది.
రద్దయిన రైళ్లు ఇవే : ఈ రూట్‌లో నడిచే దాదాపు 43 రైళ్లను రద్దు చేసినట్లు తెలుస్తోంది. మరో 38 రైళ్లను దారి మళ్లించింది. బెంగళూర్ గౌహతి రైలు.. విజయనగరం, టిట్లాగఢ్, టాటా మీదుగా దారి మళ్లించారు. అలాగే సికింద్రాబాద్-షాలిమార్‌ని దారి మళ్లించారు. హౌరా-హైదరాబాద్(ఈస్ట్ కోస్ట్), హౌరా-సికింద్రాబాద్(ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్), హౌరా-తిరుపతి రైళ్‌లు రద్దు అయ్యాయి.
12837 హౌరా–పూరీ ఎక్స్‌ప్రెస్ (02.06.2023),
12863 హౌరా–సర్ ఎం.విశ్వేశ్వరయ్య టెర్మినల్ ఎక్స్‌ప్రెస్ (02.06.2023),
12839 హౌరా–చెన్నై మెయిల్ (02.06.2023),
12895 షాలిమార్–పూరీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (02.06.2023),
20831 షాలిమార్–సంబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్(02.06.2023),
02837 సంత్రాగచ్చి–పూరి (02.06.2023),
22201 సీల్దా–పూరీ దురంతో ఎక్స్‌ప్రెస్ 0(2.06.2023),
12074 భువనేశ్వర్–హౌరా జన్ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ (03.06.2023),
12073 హౌరా–భువనేశ్వర్ జన శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ (03.06.2023),
12278 పూరీ–హౌరా శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ (03.06.2023),
12277 హౌరా–పూరీ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ (03.06.2023),
12822 పూరీ–షాలిమార్ ధౌలీ ఎక్స్‌ప్రెస్ (03.06.2023),
2821 షాలిమార్ – పూరి ధౌలీ ఎక్స్‌ప్రెస్ (03.06.2023),
12892 పూరి–బంగిరిపోసి (03.06.2023),
12891 బంగిరిపోసి–పూరి ఎక్స్‌ప్రెస్ (03.06.2023),
02838 పూరీ–సంత్రగచ్చి స్పెషల్ (03.06.2023),
12842 చెన్నై–షాలిమార్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ (03.06.2023),
12509 ఎస్‌ఎంవీటీ బెంగళూరు–గౌహతి (02.06.2023)


News
శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్

కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.


News
16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.


News
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.


-
News2 weeks ago
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా
-
News3 weeks ago
భారీ వర్షనికి రామజల చెరువు నిండి ఇళ్లలోకి నీరు
-
News3 weeks ago
తుంగభద్ర డ్యాంకు పెరుగుతున్న వరద నీరు 27-09-2025
-
News3 weeks ago
ఆదోని డివిజన్లో కురిసిన వర్షపాతం
-
Business3 weeks ago
రోజు రోజుకు పతనమవుతున్న పత్తి ధర..
-
Business4 weeks ago
Gold, Silver Price బంగారు ధర
-
Business4 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
-
Business4 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు