8 గ్రామాల సచివాలయాల ముందు ఆందోళన

కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని 8 గ్రామ సచివాలయల ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు నిరసనగా సిపిఎం పార్టీ నాయకులు ఆందోళన నిర్వహించి వినతిపత్రం అందజేశారు. పెరిగిన నిత్యవసర వస్తువులు ధరలు తగ్గించాలని, నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని, కరెంటు చార్జీల భారాలు తగ్గించాలని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు నిరసనగా సచివాలయాల ముందు ఆందోళన నిర్వహించరు. నారాయణపురం సచివాలయం దగ్గర సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు కే వెంకటేశులు, దొడ్డనకేరి, మాంత్రికి సచివాలయల దగ్గర మండల కార్యదర్శి లింగన్న, గనేకల్, బల్లెకల్ సచివాలయల దగ్గర మండల కార్యదర్శి వర్గ సభ్యులు బి వీరారెడ్డి, జే. రామాంజనేయులు, బసరకోడు సచివాలయం దగ్గర ఎం. ఉచీరప్ప హనవాళ్ సచివాలయం దగ్గర పి భాష, సంతే కుడ్లూరు సచివాలయం దగ్గర బీ తిక్కప్ప నాయకత్వం వహించారు.
ఈ ఆందోళనలో సిపిఎం పార్టీ శాఖా కార్యదర్శులు జి రంగనాథ్, కే.పాండురంగ, కే గోవిందు, రామాంజనేయులు, దస్తగిరి బాషా, వీరేష్, పార్టీ సభ్యులు దొడ్డనకేరి మునిస్వామి ఈరన్న, బసరకోడు మునిస్వామి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సచివాలయ అధికారులకు వినతిపత్రం అందజేస్తున్న సిపిఎం నాయకులు

పూర్తి వివరాల కోసం వీడియో చూడండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top