News
తప్పిపోయి 30 సంవత్సరాల తర్వాత ఇంటికి చేరిన యువకుడు..

తప్పిపోయి 30 సంవత్సరాల తర్వాత సొంత కుటుంబానికి చేరాడు యువకుడు..
కర్నూలు జిల్లా ఆదోని పట్టానికి చెందిన వీరేష్ గత 30 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల వయసులో రైల్లో తప్పిపోయి తమిళనాడులో ప్రత్యక్షమయ్యాడు. అక్కడ బోర్డింగ్ లో కొద్దిరోజులు నివసించి. అక్కడనుండి ముంబై లోని అనాధాశ్రమమునకు బదిలీ చేశారు. అక్కడే పదవ తరగతి వరకు చదువుకొని హోటల్లో వెయిటర్ గా పనిచేస్తున్నాడు. ఎప్పటికైనా సొంత వారిని కలుస్తానన్న ఆశ తగ్గలేదు. కేవలం అతనకు నానమ్మ అంజనమ్మ, నాన్న జనార్ధన్, ఊరు ఆదోని అని మాత్రమే తెలుసు. ఈ నేపథ్యంలోనే గత రెండు రోజుల నుంచి ఆదోని లో తిరుగుతున్న ఎటువంటి కుటుంబ సభ్యుల సమాచారం అందలేదు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉన్నదని తెలుసుకొని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు తనకు జరిగిన విషయాన్ని తెలియజేశాడు. అనంతరం సబ్ కలెక్టర్ వెంటనే స్పందించి మున్సిపల్ కమిషనర్ ఫోన్ ద్వారా వీరేష్ వివరాలు తెలియజేసారు. ఈ నేపథ్యంలో పట్టణంలో ఉండే సచివాలయాల్లో మరియు సామాజిక మాధ్యమం, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రకటన విడుదల చేశారు. ప్రకటనల ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న మేనత్త భర్త జగదీష్ సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. జగదీష్ విషయాలను పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని తాసిల్దార్ వారికి మరియు మున్సిపల్ కమిషనర్కు సబ్ కలెక్టర్ ఆదేశించారు. అనంతరం పూర్తిస్థాయిలో విచారణ చేపట్టగా వీరేష్ వారి అమ్మ వీరేష్ పుట్టిన సంవత్సరం లోపల మరణించిందని, వీరేష్ తండ్రి అనారోగ్యంతో 2008 సంవత్సరంలో మరణించాడని అలాగే వారి నానమ్మ అంజనమ్మ 2011వ సంవత్సరంలో మరణించారని తెలిపారు. వారి కుటుంబ సభ్యులలో వారి మేనత్త లక్ష్మి (చిట్టెమ్మ) మాత్రమే జీవించారని ప్రస్తుతం వారు కర్నూలు నగరంలో నివసిస్తున్నారని విచారణలో తెలిపారు. చిన్నప్పుడు తను నివసించిన ప్రదేశాల్లో మేనత్త భర్త అయినా జగదీష్ తీసుకెళ్లి చూపించాడు. చూసిన వీరేష్ ఇవన్నీ నిజమేనని వీరు నా రక్త సంబాధికులే అని వీరేష్ అధికారులకు తెలిపాడు.
ఈ సందర్భంగా వీరేష్ జనార్ధన్ మాట్లాడుతూ… నేను చిన్న వయసులో తప్పిపోయాను, 30 సంవత్సరాలు అయిందని నా కుటుంబ సభ్యులను , 24 గంటల్లోపే నాయొక్క కుటుంబ సభ్యుల చెంతకు చేర్చిన సబ్ కలెక్టర్కు, మున్సిపల్ కమిషనర్, తాసిల్దార్, రెవెన్యూ, మీడియా సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మేనత్త భర్త అయినా జగదీష్ మాట్లాడుతూ… వీరేష్ కొరకు చాలా రోజులుగా వెతికాము కానీ ఎటువంటి సమాచారం లేదు, 30 సంవత్సరాల తర్వాత వీరేష్ మమ్మల్ని వెతుక్కుంటూ రావడం చాలా భావిద్వేగానికి గురై సంతోషం గా ఉన్నది. వీరేష్ మా వరకు తీసుకొని వచ్చిన ప్రభుత్వ అధికారులకు మరియు మీడియా కృతజ్ఞతలు తెలియజేశారు.
News
శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్

కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్‌మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.


News
16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.


News
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.


-
News2 weeks ago
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా
-
News3 weeks ago
భారీ వర్షనికి రామజల చెరువు నిండి ఇళ్లలోకి నీరు
-
News3 weeks ago
తుంగభద్ర డ్యాంకు పెరుగుతున్న వరద నీరు 27-09-2025
-
News3 weeks ago
ఆదోని డివిజన్లో కురిసిన వర్షపాతం
-
Business3 weeks ago
రోజు రోజుకు పతనమవుతున్న పత్తి ధర..
-
Business4 weeks ago
Gold, Silver Price బంగారు ధర
-
Business4 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
-
Business3 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు