కర్నూలు జిల్లాలో 16 మంది ఉత్తమ మహిళా పోలీసులు ఎంపిక

డైరెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ శాఖ నుంచి కర్నూలు జిల్లాకు చెందిన 16 మంది ఉత్తమ మహిళా పోలీసులు ఎంపిక చేసి ప్రశంసా పత్రం అందించారు అందులో ఆదోని పట్టణం క్రాంతి నగర్ సచివాలయంలో పనిచేస్తున్న హైమావతి మహిళా పోలీస్ మరియు మరాటి వాడి స్ట్రీట్ సచివాలయంలో పనిచేస్తున్న జ్యోతి మహిళా పోలీస్ కు మున్సిపల్ చైర్ పర్సన్ శాంత మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి అభినందన పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ శాంతా మాట్లాడుతూ ఆదోని నుంచి ఇద్దరు మహిళా పోలీసులు ఎన్నికవ్వడం సంతోషదాయకమైన విషయం అని మహిళా పోలీసులకు సత్కరించి ఇటువంటి మరెన్నో అభినందనలను/ బహుమతులను అందుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మరియు ఇతర మహిళా పోలీసులు పాల్గొన్నారు.

అభినందన పత్రాలను అందజేస్తున్న మున్సిపల్ కమిషనర్
అభినందన పత్రాలను అందజేస్తున్న మున్సిపల్ కమిషనర్
మహిళా పోలీసులతో గ్రూప్ ఫోటో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version