చేనేత ప్రోత్సాహానికి శారీ వాక్

అమరావతి : విశాఖలో చేనేత ప్రోత్సాహానికి బీచ్ వద్ద శారీ వాక్ నిర్వహించారు మహిళలు. ఈ శారీ వాక్‍లో 8 వేల మంది మహిళలు, విశాఖ యువతులు పాల్గొన్నారు. “ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ” ఆధ్వర్యంలో బీచ్ రోడ్డులో శారీ వాక్ చేశారు. శారీ వాక్‍లో ముఖ్యఅతిథిగా హోంమంత్రి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ చేనేత కార్మికులు ఇప్పటికీ చాలా ఇబ్బందులు పడుతున్నారుఅని ఆవేదన వ్యక్తంచేశారు. నేతన్నల బతుకుల్లో వెలుగు నింపడానికి ప్రభుత్వం కృషిచేస్తోందని భరోసా ఇచ్చారు.

శారీ వాకో లో పాల్గొన్న మహిళలు యువత
విశాఖలో చేనేత ప్రోత్సాహానికి బీచ్ వద్ద శారీ వాక్ నిర్వహించారు మహిళలు.

Leave a Comment