మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. సాయి ప్రసాద్ రెడ్డి

కర్నూలు జిల్లా ఆదోని: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు, మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదోనిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, యూత్ విభాగం, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.

దీక్షలో పాల్గొన్న నాయకులు

​ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… మెగా డీఎస్సీ నిర్వహణపై అనేక అనుమానాలు, ఆరోపణలు వస్తున్నందున దీనిపై స్వతంత్ర సంస్థ అయిన సీబీఐచే సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తప్పు జరగకపోతే సీబీఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. విద్యాశాఖ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలన్నారు.

దీక్ష శిబిరంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి

వైఎస్సార్‌సీపీ ప్రధాన డిమాండ్లు: ◆ సీబీఐ విచారణ: మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించి, ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలి. ◆ ​నిరుద్యోగ భృతి: ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు ₹3,000 భృతిని వెంటనే విడుదల చేయాలి. ◆ ఫీజు రీయింబర్స్‌మెంట్: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆదుకోవాలి.

దీక్ష శిబిరంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి

​ప్రభుత్వం స్పందించకపోతే నిరుద్యోగులు, విద్యార్థుల తరఫున పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు వెంకటేష్ రెడ్డి, జీవన్ సింగ్, ఫయాజ్ అహ్మద్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ స్థానిక నాయకులు, కౌన్సిలర్లు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
Back To Top