ఆదోనికి 6 కొత్త ‘తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలు
కర్నూలు జిల్లా ఆదోని ఎంసిహెచ్ (MCH) ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో మంగళవారం నూతనంగా మంజూరైన 102 ‘తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాల ను ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి రిబ్బన్ కట్ చేసి నూతన వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆదోని నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం మొత్తం 6 తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ నూతన వాహనాలను అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. కర్నూలు జిల్లాలోనే అత్యధిక ప్రసవాలు జరిగే ఆసుపత్రుల్లో ఆదోని ఎంసిహెచ్ ప్రథమ స్థానంలో […]