DYFI ఆధ్వర్యంలో పాండవగల్లు బస్టాండ్ వద్ద రాస్తారోకో

కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్లు గ్రామం నుండి ఎరిగేరి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల కోసం తక్షణమే ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలని డివైఎఫ్ఐ (DYFI) డిమాండ్ చేస్తూ మంగళవారం పాండవగల్లు బస్టాండ్ ప్రధాన రహదారిపై విద్యార్థులు, నాయకులతో కలసి రాస్తారోకో నిర్వహించారు.

రాస్తారోకోతో నిలుబడిపోయిన వాహనాలు
వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

ఈ సందర్భంగా డివైఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు చిరంజీవి మాట్లాడుతూ… పాండవగల్లు గ్రామం నుండి ప్రతినిత్యం సుమారు 200 మందికి పైగా విద్యార్థులు ఎరిగేరి హైస్కూల్‌కు వెళ్లి వస్తుంటారని తెలిపారు. అయితే, ఈ రూట్లో వెళ్లే ఉరుకుంద, కౌతాళం తదితర బస్సులు గ్రామంలో ఆపకుండా వెళ్ళిపోతుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుర్హున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన రవాణా సౌకర్యం లేక చాలామంది విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. 13వ తేదీ నుండి శ్రావణమాస ఉత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ మార్గంలో ప్రయాణికుల రద్దీ పెరుగుతుందని, ఫలితంగా విద్యార్థులు మరీంత అవస్థలు పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రవాణా శాఖ అధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించి పాండవగల్లు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ గ్రామ నాయకులు మోహన్ రెడ్డి, మంజు, భాష, వీరాంజి, పలు ప్రజాసంఘాల నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Back To Top
Exit mobile version