ఆదోనిలో దొంగల హల్చల్ ఒకే రోజు మూడు కాలనీల్లో దోపిడీ!
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు కాలనీల్లో ఒకే రోజు వరుస దొంగతనాలకు పాల్పడి స్థానికులను భయాందోళనలకు గురిచేశారు. నగదు, బంగారంతో ఉడాయించారు. కత్తి ఆంజనేయులు కాలనీ నివాసముంటున్న రాము అనే బ్యాంక్ ఉద్యోగి ఇంట్లో దొంగలు చొరబడ్డారు. హాస్పిటల్ లో తండ్రి ఆపరేషన్ కోసం తెచ్చుకున్న డబ్బులను బీరువా పగులగొట్టి 1,50,000 రూపాయల నగదు, 6 గ్రాముల బంగారం, 30 తులాల వెండి వస్తువులను అపహరించారు. […]