News
ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్న జయ మనోజ్ రెడ్డి
కర్నూలు జిల్లా ఆదోని 34 వార్డు ఎల్.బి స్ట్రీట్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్చార్జి జయ మనోజ్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి గడపకు తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జయ మనోజ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి పేదవాళ్ళకి అమ్మ ఒడి, నాడు నేడు కింద స్కూళ్ళు సుందరికరణ, రజకులకు నాయి బ్రాహ్మణులకు మౌజాన్లకు పాస్టర్లకు, బ్రాహ్మణులకు చేనేతలకు, డ్వాక్రా మహిళలకు ఇలాగ అనేక వర్గాలకు అండగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నిలిచిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాల తో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేసింది తెలిపారు.

చంద్రబాబు ప్రభుత్వంలో దోపిడీ దొంగ గా ప్రజా కోర్టులో ప్రజా ద్రోహిగా చంద్రబాబు నిలవడం జరిగింది అని అన్నారు. ప్రజల ఆశీస్సులతో 2024లో వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి సీఎంగా అలాగే సాయి ప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి ఈ రాష్ట్ర అభివృద్ధికి నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలందరూ కూడా సహకరించాలని జయ మనోజ్ రెడ్డి కోరారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి ఆదోని పట్టణ అధ్యక్షులు బి దేవా స్టేట్ డైరెక్టర్ రేణుక చైర్పర్సన్ బోయ శాంత జిల్లా ఒక బోర్డ్ చైర్మన్ నియాజమ్మద్ కౌన్సిలర్లు రఘునాథ్ రెడ్డి చలపతి నర్సింలు మధుసూదన్ శర్మ మాజీ మార్కెట్ చైర్మన్ భాష శ్రీలక్ష్మి జులేఖబి చిన్న ఈరన్న సన్నీ రహీం గంగాధర్ కోదండ శంకర్ శోభలత నాగరాజ్ శీనా వార్డు కౌన్సిలర్ అంజినమ్మ వార్డ్ ఇన్చార్జి కె భాస్కర్ సూరి రామలింగేశ్వర్ యాదవ్ మధు సచివాలయం సిబ్బంది మున్సిపల్ అధికారులు తదితరు పాల్గొన్నారు.
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్‌సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్‌సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్‌సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్‌సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్‌ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




