News
వైసీపి పార్టీ లో జిల్లా నూతన కార్యవర్గం
అధ్యక్ష, కార్యదర్శులతో పాటు వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీ సహా మొత్తం కార్యవర్గాన్ని ప్రకటించిన వైసిపి కేంద్ర కార్యాలయం
పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలతో నూతన నియామకాలను చేపట్టినట్లు ప్రకటన.
అన్ని జిల్లాలకు కొత్త కార్యవర్గాలని నియమిస్తూ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు.
అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షురాలిగా : కొత్తగుల్లి భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే
అనకాపల్లి జిల్లా : బొడ్డేట ప్రసాద్
అనంతపురం : పైల నరసింహయ్య
అన్నమయ్య జిల్లా : గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యే
బాపట్ల : మోపిదేవి వెంకటరమణ, ఎంపీ
చిత్తూరు : కె ఆర్ జె భరత్, ఎమ్మెల్సీ
కోనసీమ : పొన్నాడ వెంకట సతీష్ కుమార్, ఎమ్మెల్యే
ఈస్ట్ గోదావరి : జక్కంపూడి రాజా, ఎమ్మెల్యే
ఏలూరు : ఆళ్ల నాని, ఎమ్మెల్యే
గుంటూరు : డొక్కా మాణిక్య వరప్రసాద్
కాకినాడ : కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే
కృష్ణా : పేర్ని నాని, ఎంఎల్ఏ
కర్నూలు : వై బాలనాగిరెడ్డి, ఎమ్మెల్యే
నంద్యాల : కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే
ఎన్టీఆర్ జిల్లా :వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే
పల్నాడు జిల్లా : పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే
పార్వతీపురంమన్యం : శత్రుచర్ల పరీక్షిత్ రాజు,
ప్రకాశం : జంకె వెంకటరెడ్డి
నెల్లూరు : వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎంపీ
సత్యసాయి జిల్లా : ఎం. శంకరనారాయణ, ఎమ్మెల్యే
శ్రీకాకుళం :ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యే
తిరుపతి జిల్లా : నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి
విజయనగరం : మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), జడ్పీ చైర్మన్
వెస్ట్ గోదావరి : చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యే
వైఎస్ఆర్ జిల్లా : కె.సురేష్ బాబు, మేయర్
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




