కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలో గత నెల మే 30వ తేదీ మైనర్ బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. మాయ మాటలు చెప్పి తీసుకెళ్లిన ముగ్గురిని అరెస్టు చేసిన డీఎస్పీ ముందు హాజరు పరిచారు. డీఎస్పీ శివ నారాయణ స్వామి తెలిపిన వివరాల మేరకు మైనర్ బాలికకు బోయ వీరేష్ అనే వ్యక్తి ప్రేమిస్తున్నా అని మాయమాటలు చెప్పి తన ఇద్దరి అన్నదమ్ములు తలారి ఈరన్న, గ్యాంగ్ లక్ష్మణ్ సహాయంతో కారులో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ద్వితి అనే గ్రామానికి తీసుకెళ్లి శారీరకంగా వాడుకున్నాడని తెలిపారు వీరిపై సెక్షన్ లా 366(A) r/w 34 ఐపిసి సెక్షన్ 4 of ఫోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించామని డీఎస్పీ తెలిపారు.