Connect with us

News

మనస్థాపానికి గురై రైలు కిందపడి ఆత్మహత్య

Published

on

తన చావుకు చందా సబ్ దర్గా వాళ్లైన పాన్ షాప్ సలాం మరియు చోటు అని చీటీ వ్రాసుకొని తన వద్ద పెట్టుకొని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని రైల్వే పోలీసులు తెలిపారు వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా ఆదోనిలో కార్వాన్ పేట , కరీం దివాస్ దర్గా వద్ద నివాసం ఉంటున్న కంది రాము (47) రాము అనే వ్యక్తి గురువారం 4.5.203 వ తేది రాత్రి 10 గంటలపుడు గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొన్నాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని అతని కుటుంబ సభ్యులను విచారిచాగా సుమారు 14 సం.ల నుండి ఆదోని టౌన్ లోని చందా సాబ్ దర్గా ఇనాం స్తలమ్ లో షెడ్ వేసుకోసి అందులో సప్లయర్ షాప్ మరియు జిరాక్స్ షాప్ పెట్టుకొని జీవిస్తూ ఉన్నాడని షాప్ ప్రక్కలో స్వంత ఖర్చులతో ఇంకొక షెడ్ కట్టించి దాన్నిని ఎరువుల అంగిడ్ వాళ్లకు ఇచ్చినాడని, అలాగే ఒక స్సం., క్రితం అదే దర్ఘ స్తలంలో ఉన్న ఒక హోటల్ ను తమిళనాడు వాళ్ళ నుండి 8 లక్షలకు కొనగా అపుడు దర్గా వాల్లు ఎలా కొంటావని, ఒక లక్ష ఇచ్చి ఖాలీ చేయించి నారని, అలాగే సుమారు 8 నెలల నుండి రాము నుండి బాడిగ తీసుకోకుండా రాము ఉన్న షాప్ ఖాలీ చేయాలనీ ఒత్తిడి చేసినారని , అందుకు రాము అతని కుటుంబ సబ్యులు ఎంత వేడుకున్నా వాళ్లు వినలేదని పోలీసులకు బంధువులు తెలిపారు. మరల రాము షాప్ వద్దకు వచ్చిఖాలీ చేయండి లేకపోతే ఎక్కడికైనా పోయి చావండి అని చెప్పినారని, అందుకు రాము మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోన్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆదోని రైల్వే SI రామస్వామి దర్యాప్తు చేసి section 306 r/w 34 IPC గా మార్చి సదరు దర్గా హక్కు దారులైన పాన్ షాప్ సలాం , చోటు @ సలీం లపై కేసు నమోదు చేశారు.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

తుంగభద్రా డ్యాం 4 గేట్లు ఎత్తి దిగువకు నీరు

Published

on

తుంగభద్ర డ్యాం. 02 07 2025 బుధవారం ఉదయం నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నట్లు డ్యామ్ అధికారులు తెలిపారు. రెండు అడుగులు ఎత్తుకు నాలుగు గేట్లు ఎత్తి దిగువకు 10400 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు తుంగభద్ర డ్యామ్ అధికారులు సమాచారం ఇచ్చారు నది తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తుంగభద్ర డ్యాం అధికారులు ఆదేశాలు  జారీ చేశారు.
.

తుంగభద్ర డ్యాం నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీరు వదిలిన అధికారులు
Continue Reading

News

అక్రమంగా ఫీజులు వసూలు చేస్తూన్నారు

Published

on

ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు  గుర్తింపు రద్దు చేయాలని డి ఎస్ ఎఫ్, పిడిఎస్ఓ విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లా ఆదోని బీమాస్ రెస్టారెంట్లో విద్యార్థి సంఘాలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిహెచ్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, పి ఎస్ డి ఓ రాష్ట్ర నాయకుడు తిరుమలేష్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కొన్ని పాఠశాల యాజమాన్యలు స్కూల్ ఫీజు, యూనిఫామ్ ఫీజు బస్సు ఫీజు, ట్యూషన్ ఫీజు, డిపాజిట్ ఫీజ్ అని రకరకాల పేర్లతో తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు వసూళ్లకు పాల్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత చేస్తున్నా విద్యాశాఖ అధికారులు ఏమి తెలియనట్లు వివరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించాలని డి.ఎస్.ఎఫ్, పి.డి.ఎస్.ఓ విద్యార్థి సంఘా నాయకులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో దశలవారీగా ఉద్యమాలు చేపట్టేందుకు సిద్ధమవుతామని ప్రభుత్వనికి, విద్యాశాఖ అధికారులను హెచ్చరించారు.ఈ సమావేశంలో DSF, PDSO నాయకులు నవీన్ రాజ్ కుమార్ కిరణ్ పాల్గొన్నారు.

ధనాపురం ఉదయ్ యూట్యూబ్ వీడియో
Continue Reading

News

ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

Published

on

By

ఆదోని 02 07 25:

రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 38/- రూపాయలు, రిటైల్: 1kg 40/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 23/- రూపాయలు, రిటైల్: 1kg 25/- రూపాయలు

02 07 25 రైతు బజార్ ధరల పట్టిక
Advertisement

Continue Reading

Trending