ఆదోని మున్సిపల్ పోరులో చరిత్రాత్మక విజయం

2,061 ఓట్ల మెజారిటీతో మున్సిపల్ చైర్మన్‌గా గెలుపొందిన స్వప్న నాయకర్ ◆ ప్రధాన పార్టీలైన టీడీపీ, వైఎస్సార్‌సీపీలకు గట్టి షాక్.. ఉంగరం గుర్తుతో రెబల్ సంచలనం ◆ 52 వార్డుల్లో ముగిసిన కౌంటింగ్: టీడీపీ 30, వైఎస్సార్‌సీపీ 16 స్థానాలు కైవసం

కౌంటింగ్ హాల్ బయట విజయోత్సవాలు చేసుకుంటున్న జనసేన నాయకులు
వీడియో చూడండి ఈ లింక్ పై క్లిక్ చేయండి

ఆదోని మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఊహించని రాజకీయ సంచలనం నమోదైంది. ప్రధాన రాజకీయ పార్టీలైన టీడీపీ, వైఎస్సార్‌సీపీలకు గట్టి షాక్ ఇస్తూ జనసేన రెబల్ (ఇండిపెండెంట్) అభ్యర్థి స్వప్న నాయకర్ చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నారు. మున్సిపల్ చైర్మన్ స్థానానికి జరిగిన హోరాహోరీ పోరులో ఆమె ప్రత్యర్థులపై ఏకంగా 2,061 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకున్నారు.

కౌంటింగ్ హాల్ బయట విజయోత్సవాలు చేసుకుంటున్న జనసేన నాయకులు

‘ఉంగరం’ గుర్తుతో బరిలోకి దిగిన స్వప్న నాయకర్, అధికార-ప్రతిపక్ష పార్టీల వ్యూహాలను తలకిందులు చేస్తూ ఓటర్ల మద్దతును కూడగట్టడంలో విజయవంతమయ్యారు. ఎన్నికల ఫలితం వెలువడగానే ఆమె మద్దతుదారులు, అనుచరులు బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ పట్టణవ్యాప్తంగా భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

ఓట్ల లెక్కింపు చేస్తున్న ఫోటో

52 వార్డుల్లో ఫలితాల సరళి: ఆదోని మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 52 వార్డుల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పకడ్బందీగా పూర్తయింది. వార్డుల వారీగా పార్టీల బలాబలాలు పరిశీలిస్తే: తెలుగుదేశం పార్టీ (టీడీపీ): 30 వార్డులు ◆ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్‌సీపీ): 16 వార్డులు ◆ భారతీయ జనతా పార్టీ (బీజేపీ): 03 వార్డులు ◆ టీడీపీ రెబల్: 01 వార్డు ◆ సీపీఎం (CPM): 01 వార్డు ◆ సీపీఐ (CPI): 01 వార్డు

కౌంటింగ్ హాల్ బయట విజయోత్సవాలు చేసుకుంటున్న జనసేన నాయకులు

వార్డుల్లో టీడీపీ స్పష్టమైన ఆధిక్యం కనబరిచినప్పటికీ, అత్యంత ప్రతిష్టాత్మకమైన చైర్మన్ స్థానంలో మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన స్వప్న నాయకర్ రికార్డు స్థాయి మెజారిటీతో గెలుపొందడం స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పుతో ఆదోని పట్టణ అభివృద్ధికి సరికొత్త బాటలు వేస్తానని విజేత స్వప్న నాయకర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.