కైలాస మానససరోవర యాత్రకు వెళ్లి వరదల కారణంగా చిక్కుకుపోయిన యాత్రికులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చే బాధ్యత తమదని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి భరోసా ఇచ్చారు. యాత్రికుల బృందంలోని భాస్కర శాస్త్రి కుమారుడితో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి అక్కడి పరిస్థితులను స్వయంగా తెలుసుకున్నారు.
15 రోజుల క్రితం తీర్థ యాత్రలకు వెళ్లి కైలాస మానససరోవర యాత్రలో చిక్కుకున్న ఆదోని కి చెందిన నలుగురు యాత్రికులు భాస్కర్ శాస్త్రి, భార్య శారద తో పాటు కొడుకు రఘునాథ శాస్త్రి, కోడలు హన్సిక.
నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో భారీ వర్షాలకు రోడ్లు కొట్టుకుపోయి దాదాపు పది వంతెనలు దెబ్బతినడంతో తిరుగు ప్రయాణం నిలిచిపోయింది. ప్రస్తుతం యాత్రికులు టిబెట్‌లోని దార్చెన్ (15,000 అడుగుల ఎత్తు) వద్ద సురక్షితంగా ఉన్నారు. బృందంలోని మిగిలిన సభ్యులు శిఖర పరిక్రమ ముగించుకుని ఒకటి లేదా రెండు రోజుల్లో దార్చెన్ చేరుకోనున్నారు. యాత్రికులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. అధికారులతో మరియు రెస్క్యూ బృందాలతో సమన్వయం చేసుకుని అందరినీ క్షేమంగా స్వస్థలాలకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. యాత్రికుల వివరాలు, స్థానిక హెల్ప్‌లైన్ నంబర్లను ఎప్పటికప్పుడు అందించాలని కోరారు.