డీఎస్సీలో ‘చిన్న తప్పు’పై ప్రభుత్వం సమాధానం చెప్పాలి: ఫయాజ్ అహ్మద్

శాసనమండలిలో మంత్రి అచ్చెన్నాయుడు డీఎస్సీలో “చిన్న తప్పు జరిగింది” అని ప్రకటించడం నిరుద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మున్సిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మండిపడ్డారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మున్సిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్

కర్నూలు జిల్లా ఆదోని లో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మున్సిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ విలేకరులతో మాట్లాడుతూ క్వశ్చన్ పేపర్ లీక్ ఆరోపణలు, స్పోర్ట్స్ కోటా ఫేక్ సర్టిఫికెట్ల వివాదం ప్రభుత్వానికి చిన్న విషయాలుగా కనిపిస్తున్నాయా అని సూటిగా ప్రశ్నించారు. నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారి వివరాలు, వాటిని ధ్రువీకరించిన అధికారులపై తీసుకున్న చర్యలను ప్రభుత్వం తక్షణమే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అర్హులైన అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోతే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రభుత్వని నిలదీశారు. డీఎస్సీ నియామక ప్రక్రియ, వెరిఫికేషన్ రికార్డులపై నిష్పక్షపాత విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Back To Top