News
ఆదోని పాత బ్రిడ్జిపై నుంచి పడి వృద్ధురాలికి తీవ్రగాయాలు
కర్నూలు జిల్లా ఆదోని పాత ఓవర్ బ్రిడ్జి పై నుండి కింద పడి శాంతమ్మ (70) అనే వృద్ధురాలికి తీవ్రగాయాలు అయ్యాయి. వృద్ధురాలి కుమారుడు మహానంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి కల్లుబాయిలో నివాసం ఉంటున్నామని వారం రోజుల క్రితం మహానంది తల్లి శాంతమ్మ (70) ఆస్పరి లో ఉన్న తన కూతురు వద్దకు వెళ్లి ఈరోజు మధ్యాహ్నం తిరుగు ప్రయాణమై బ్రిడ్జిపై నుంచి నడుచుకుంటూ వస్తూ కళ్ళు తిరగడంతో కింద పడిందని మహానంది తెలిపారు. స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా తీవ్ర గాయాలు ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారని మహానంది మీడియాకు తెలిపారు.
News
మత్తులో వాహనాలు నడిపితే శిక్షలు తప్పవు
మద్యం మత్తులో వాహనాలు నడిపితే తీవ్రమైన శిక్షలు తప్పవని మరోసారి రుజువు అయ్యింది.

కర్నూలు జిల్లా ఆదోని మండలంలో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. మద్యం మత్తులో వాహనాలను నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు లో పట్టుబడిన 15 మందిని పోలీసులు న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. వారిలో ట్రాఫిక్ పోలీసులు నలుగురిని, రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 11 మందిని అదుపులోకి తీసుకుని కోర్టు లో హాజరు పరుచగా విచారణ అనంతరం న్యాయమూర్తి 4 గురికి ఒక వారం రోజులు, 5 గురికి 30 రోజులు రిమాండ్ విధిస్తూ ఆదోని సబ్ జైలుకు తరలించరు. 6గురికి 10 వేల రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించరు. రోడ్డుపై ప్రయాణించే వాహన చోదకులు ముఖ్యంగా ద్విచక్ర వాహనాలతో పాటు, అన్ని రకాల వాహనాలను నడిపే వాహన డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలను రోడ్డుపై నడపవద్దని, ఇది చాలా ప్రమాదకరమని ఇకపై ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలో పట్టుపడితే ఇదే విధమైన జైలు శిక్ష తప్పదని ఆదోని పోలీసులు హెచ్చరించరు.

News
ఆదోనిలో రోడ్డు ప్రమాదం – వ్యక్తి మృతి
కర్నూలు జిల్లా ఆదోనిలో ఆస్పరి బైపాస్ రోడ్డు పెట్రోల్ బంక్ సమీపంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని AP 04 V 1430 నంబర్‌గల లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నప్పటికీ, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ రౌండ్ టేబుల్ సమావేశం
పేద బలహీన బడుగు వర్గాల వారికి వ్యతిరేకంగా పేద విద్యార్థుల మెడికల్ విద్యను దూరం చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు సునీల్..

కర్నూలు జిల్లా సునీల్ఆదోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ పై డివిజన్ స్థాయి ఎస్సీ సెల్ రౌండ్ టేబుల్ సమావేశం నియోజకవర్గ అధ్యక్షులు ఉల్లిద్ర యోసోబు ఆధ్వర్యంలో నిర్వహించరు. సమావేశంలో ముఖ్య అతిథిగా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మరియు రాయలసీమ ఎస్సీ సెల్ ఇంచార్జ్ సునీల్, జిల్లా ఇన్చార్జ్ ఉప్పర పాడి యోబు, జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు డివిజన్ స్థాయి నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

