Connect with us

News

గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టండి.. ఆదోని సబ్ కలెక్టర్

Published

on

కర్నూలు జిల్లా ఆదోనిలో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు. గురువారం ఆదోని పట్టణంలో  నిమజ్జనం వెళ్లే ప్రధాన దారి అయినా , తిక్క స్వామికి దర్గా, ఎమ్మిగనూరు సర్కిల్, బీమా సర్కిల్, ఫరిసా మోహల్ల, శ్రీనివాస్ భవన్, గణేష్ సర్కిల్, న్యూ ఫ్లైవర్, వినాయక ఘాట్ ప్రధాన దారులను తనిఖీ చేసి పరిశీలించారు.

వినాయక కాటు వద్ద పరిశీలిస్తున్న అధికారులు

ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ… నిమజ్జనం కు ఎటువంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా గణేష్ విగ్రహాల ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తుతో నిమజ్జన ఏర్పాట్లకు చేయాలని పోలీసులను విగ్రహాలు వెళ్లే దారిలో రోడ్లో ఉండే ప్యాచ్ వర్క్ ను తర్వాత గతిన పూర్తి చేయాలని కొన్ని ముఖ్యమైన ప్రదేశాలలో బారికేడ్లను ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి అధికారులకు, విగ్రహాల ఊరేగింపు సమయంలో  విద్యుత్ తీగలు, కేబుల్ వైర్లు ను అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఊరేగింపు జరిగే వీధుల్లో రోడ్డు కన్స్ట్రక్షన్ సంబంధించిన ఇసుక, కంకర అడ్డు లేకుండా చూసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు తెలిపారు. నిమజ్జనం సమయంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా పకడ్బందీ నియంత్రణ చేపట్టాలని పోలీసులకు సూచించారు. కెనాల్ దగ్గర గజ ఈతగాలను ఏర్పాటు చేయాలని ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులను, మెడికల్ క్యాంప్ ఏఆర్పాటు చేయాలని వైద్యాధికారులకు, నిమజ్జనం సమయంలో క్రేన్లు గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో ఉంచుకొని  ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జనం విజయవంతం చేయాలని సబ్ కలెక్టర్ స్పష్టం చేశారు.

అధికారులకు ఆదేశాలు ఇస్తున్న సబ్ కలెక్టర్


ఈ కార్యక్రమంలో డిఎస్పి హేమలత, తాసిల్దార్ రమేష్, మున్సిపల్ కమిషనర్ కృష్ణ, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పద్మనాభ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

వినాయక ఘాటు వద్ద అధికారులతో సబ్ కలెక్టర్
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఆదోనిలో దొంగల హల్చల్ ఒకే రోజు మూడు కాలనీల్లో దోపిడీ!

Published

on

​కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు కాలనీల్లో ఒకే రోజు వరుస దొంగతనాలకు పాల్పడి స్థానికులను భయాందోళనలకు గురిచేశారు. నగదు, బంగారంతో ఉడాయించారు.

​​కత్తి ఆంజనేయులు కాలనీ నివాసముంటున్న రాము అనే బ్యాంక్ ఉద్యోగి ఇంట్లో దొంగలు చొరబడ్డారు. హాస్పిటల్ లో తండ్రి ఆపరేషన్ కోసం తెచ్చుకున్న డబ్బులను బీరువా పగులగొట్టి 1,50,000 రూపాయల నగదు, 6 గ్రాముల బంగారం, 30 తులాల వెండి వస్తువులను అపహరించారు. పద్మావతి నగర్ లో రాజు అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు 20 వేల రూపాయల నగదు, 2 గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు బాధితుడు వాపోయాడు. సాయి నగర్ కాలనీలో కూడా దొంగలు చోరీకి ప్రయత్నించినప్పటికీ, అది విఫలమైనట్లు సమాచారం. వరుస చోరీలతో పట్టణ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దొంగలు చేతివాటం ప్రదర్శించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ​వరుస చోరీలపై సమాచారం అందుకున్న త్రీ టౌన్ పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Continue Reading

News

సహకార ఉద్యోగుల సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం బాసట

Published

on

ఆదోని, ఫిబ్రవరి 21:ఆదోనిలోని డి.సి.సి.బి (DCCB) బ్యాంక్ ఎదుట తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సహకార సంఘాల ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం శనివారం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సమ్మె శిబిరాన్ని సందర్శించిన సంఘం నాయకులు ఉద్యోగుల పోరాటానికి సంఘీభావం తెలిపారు.

సభలో మాట్లాడుతున్న వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు లింగన్న

ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె. లింగన్న, మండల కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు:

  • వ్యవసాయానికి వెన్నెముక: గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి సాగు పెట్టుబడి నుంచి ఇతర సేవల వరకు ప్రాథమిక సహకార సంఘాలు ఎంతో మేలు చేస్తున్నాయని వారు కొనియాడారు.
  • ప్రభుత్వ బాధ్యత: సహకార వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా, వాటిని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు గుర్తు చేశారు.
  • తక్షణ పరిష్కారం: గత కొంతకాలంగా తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు శాంతియుతంగా పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. వారి న్యాయమైన కోర్కెలను వెంటనే ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్ చేశారు.
సభలో మాట్లాడుతున్న వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు లింగన్న

ఈ కార్యక్రమంలో సహకార సంఘాల ఉద్యోగులు, కార్మిక సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

News

పోగొట్టుకున్న బ్యాగ్ను పోలీసులు ఒకే ఒక్క గంటలో రికవరీ

Published

on

ఆదోని, ఫిబ్రవరి 18:

ప్రయాణంలో అజాగ్రత్తగా వదిలేసిన లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఆదోని వన్ టౌన్ పోలీసులు కేవలం ఒకే ఒక్క గంటలో రికవరీ చేసి బాధితురాలికి అప్పగించారు. పోలీసుల వేగవంతమైన స్పందనపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

అసలేం జరిగిందంటే?  కౌతాలం నుంచి ఆదోనికి ఆర్టీసీ బస్సులో వచ్చిన ఓ మహిళ, విశాల్ మార్ట్ వద్ద దిగుతూ తన బ్యాగును బస్సులోనే మరిచిపోయింది. ఆ బ్యాగులో 6 లక్షల రూపాయల విలువైన 4 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. అయితే, ఆ తొందరలో తన వెంట తెచ్చుకున్న బ్యాగును బస్సులోనే మరిచిపోయారు. కొద్దిసేపటి తర్వాత బ్యాగు గుర్తుకు రావడంతో హుటాహుటిన బస్టాండ్‌కు చేరుకుని డ్రైవర్‌ను సంప్రదించారు. బస్సులో వెతికినప్పటికీ బ్యాగు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన బాధితురాలు సాయంత్రం 3:30 గంటలకు ఆదోని వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్ గారికి ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు.. బాధితురాలి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన పోలీసులు బస్సు డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు విచారణ చేపట్టారు. పలు ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గాలింపు చేపట్టారు. సాయంత్రం 4:30 గంటలకు పోగొట్టుకున్న సొత్తును తిరిగి పొందిన బాధితురాలు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

Continue Reading

Trending