కర్నూలు జిల్లా ఆదోని పట్టణ శివారు ప్రవల్లిక గార్డెన్స్ నందు 4వ తేది జరిగిన అత్యాచారం కేసులో ఇస్వీ గ్రామానికి చెందిన ముద్దాయి సంగిపోగు రమేష్ ను కడితోట క్రాస్ వద్ద తాలుకా పోలీసులు అరెస్టు చేశారు. రూరల్ సిఐ నల్లప్ప తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాబడి సమాచారం మేరకు కడితోట క్రాస్ వద్ద సంగిపోగు రమేష్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ముద్దాయిని కోర్టు లో హాజరు పరచి రిమాండ్ కు తరలించమని సిఐ సి. నల్లప్ప తెలిపారు. ముద్దాయి సమాచారం తెలుసుకుని అతడిని పట్టుకునే విషయంలో చాకచక్యంగా వ్యవహరించిన ఆదోని రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది HC జానీవాకర్, PC లు కాసీం, సురేష్, కాశీలింగం, శ్రీనివాస్ లను సర్కిల్ ఇన్స్పెక్టర్ సి.నల్లప్ప అభినందించరు.