News
నలుదిక్కుల ప్రధాన ముఖ్యమైన వార్తలు
◆ ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు పై బిజెపి కసరత్తు, అమిత్ షా నివాసంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై మీటింగ్.. ప్రధాని విదేశీ పర్యటన తర్వాతే కొత్త సీఎం ప్రమాణస్వీకారం ఉండే అవకాశం..
◆ కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య లోపారిక ఒప్పందం జరిగిందన బండి సంజయ్..
అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పోటీ చేయడం లేదని ఆరోపణ.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో బిజెపి గెలుపు ఖాయం అన్న ధీమా..
◆ బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందన్న హరీష్ రావు, కామారెడ్డి లో ఇచ్చిన డిక్లరేషన్ ను అమలు చేయాలని డిమాండ్.. క్యాబినెట్లో 42 శాతం పదవులు బీసీలకే ఇవ్వాలన్న హరీష్ రావు..
◆ వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం.. ఏపీ అంటే రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ మాత్రమే కాదన్న నేతలు అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం చంద్రబాబు దృష్టిసాదించాలని డిమాండ్..
◆ రేపు సిఐడి విచారణకు హాజరు కాలేనన్న రామ్ గోపాల్ వర్మ, స్వారీ మూవీ ప్రమోషన్ లో బిజీగా ఉండడంతో రాలేనని అధికారులకు సమాచారం. ఎనిమిది వారాల తర్వాత డేట్ ఇస్తే హాజరవుతానని సిఐడి కి తెలిపిన ఆర్జీవి..
◆ సంగారెడ్డి జిల్లా ముద్దాయి పేటలో చెరుకు తోట దగ్ధం, 14 ఎకరాల్లో పంట సాగు చేస్తున్న రైతుకు తీవ్ర నష్టం. ఎనిమిది లక్షలు నష్టం జరిగిందని లింగయ్య తీవ్ర ఆవేదన..
◆ మణిపూర్ సీఎం బిరేంద్ర సింగ్ రాజీనామా, గవర్నర్కు రాజీరామా లేఖ అందజేత, బీరన్ సింగ్ పై అవిశ్వాసం పెట్టినందుకు సిద్ధమైన కాంగ్రెస్, తాజా రాజకీయాల పరిణామంతో సీఎం పదవికి రిజైన్..
◆ రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది, కేంద్రం ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ విమర్శలు.. దేశ రక్షణ కోసం పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపు.. వైనాడ్ నియోజకవర్గం లో బూత్ స్థాయి నేతలతో ప్రియాంక భేటీ..
◆ ఆర్జికర్ ఆసుపత్రిలో అత్యాచార ఘటన పై కొనసాగుతున్న నిరసనలు.. పెద్ద ఎత్తున ర్యాలీ తీసిన జూనియర్ డాక్టర్లు.. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్..
◆ తమిళనాడులోని తిరుచిలో అలరిస్తున్న బర్డ్ పార్క్ సందర్భంగా అలరిస్తున్న ఆస్టిన్ కోళ్లు కొంగలు
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్‌ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




