Connect with us

News

నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న బాలికల హాస్టల్ విద్యార్థినిలు

Published

on

కర్నూలు జిల్లా  ఆదోని పట్టణంలో బాలికల హాస్టల్ లో విద్యార్థినీలు నీళ్లు లేక ఇబ్బందులు పడుతూ బయటి నుంచి నీళ్లు తెచ్చుకునె పరిస్థితి ఏర్పడిందని డి ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘం ఎమ్మిగనూరు సర్కిల్లో ధర్నా నిర్వహించారు.

ఎమ్మిగనూరు సర్కిల్ లో ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థి సంఘం నాయకులు

ఈ సందర్భంగా డి.ఎస్.ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ధనాపురం ఉదయ్, నవీన్ మాట్లాడుతూ మొద్దు నిద్రలో ప్రభుత్వ విద్యా అధికారులు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదోని పట్టణంలో ప్రధానంగా ట్రాఫిక్ సమస్య ఉంది విద్యార్థులు బయటకు వెళ్లి నీళ్లు తెచ్చేటప్పుడు రోడ్డు దాటే సమయంలో విద్యార్థులు కు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు! స్థానిక వార్డెన్ బాధ్యత వహిస్తారా? బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ బాధ్యత వహిస్తారా? లేదా ప్రభుత్వ విద్యా అధికారులు బాధ్యత వహిస్తార అని ప్రశ్నించారు. కరువు ప్రాంతం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు వలసలకు వెళ్తూ తమ పిల్లలు చదువులు పాడవకుండా హాస్టల్ లో ఉంటే బాగా చదువుకోని ఉన్నత స్థాయికి ఎదగాలని కలలు కంటున్నారు అయితే ప్రభుత్వ అధికారులు వారి కళలును నిజం చేసే విధంగా పనిచేయకుండా విద్యార్థులతో బయట నుంచి నీళ్లు మోయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ విద్యార్థులకు ప్రధాన నీటి సమస్యలు పరిష్కారం చూపాలని సమస్యలు పరిష్కారం కాకపోతే ఆందోళన కార్యక్రమలు చేపడుతామని హెచ్చరించారు. విద్యార్థులకు హాస్టల్స్ లో సరైన మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేసి తగిన న్యాయం చేయాలని డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ DSF విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో డి.ఎస్.ఎఫ్ నాయకులు వరుణ్, విక్రమ్, కిరణ్, వినీల్, రాజ్ కుమార్, చరణ్, సుకుమార్, సాయి తదితరులు పాల్గొన్నారు.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఖాళీ బిందెలు కొళాయి ముందు పెట్టి నిరసన

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆరెకల గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని ఖాళీ బిందెలు కొళాయి ముందు పెట్టి  గ్రామస్తులతో కలిసి సిపిఎం నాయకులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామంలో గత కొన్ని రోజులుగా త్రాగునీరు లేక గ్రామంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వం స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు అయ్యప్ప, శాఖ కార్యదర్శి నాగరాజు, పార్టీ సభ్యుడు వెంకటేష్, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Continue Reading

News

అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీ సీజ్

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మండలం డణపురం గ్రామం మేక వంక సమీపంలో గురువారం రాత్రి అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న సమాచారంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పోలీసులు, రెవెన్యూ అధికారులు వాహనాలు తనిఖీ చేస్తూ పిడిఎస్ రైస్ తరలిస్తున్న లారీని సీజ్ చేశారు. డ్రైవర్ నాగరాజు క్లీనర్ మల్లికార్జున ను పోలీసులు అదుపులో తీసుకుని విచారించగా అనంతపురం జిల్లా గుంతకల్ నుంచి కర్ణాటక రాష్ట్రం రాయచూరు పట్టణానికి ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్నట్లు గుర్తించినట్లు ఎస్సై నాగేంద్ర తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని ఇంకా ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. పంచనామా చేసిన రెవెన్యూ అధికారులు మొత్తం సుమారు 12 టన్నుల బియ్యం ఉన్నాయని వాటిని  సీజ్ చేసి రేషన్ బియ్యాన్ని స్టాక్ పాయింట్ గోడౌన్ కు తరలిస్తున్నట్లు ఎస్ఐ నాగేంద్ర తెలిపారు.

అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీ
మీడియాకు వివరాలు అందిస్తున్న ఎస్ఐ నాగేంద్ర
Continue Reading

News

రోడ్ సేఫ్టీ పై వినూత్న రీతిలో విద్యార్థుల ప్రదర్శన

Published

on

కర్నూలు జిల్లా ఆదోని లో జాతీయ రహదారి భద్రత మహోత్సవాలు-2025 లో భాగంగా పోలీసు అధికారులు  బీమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీ విద్యార్థులతో వినూత్న రీతిలో యమధర్మరాజు, చిత్రగుప్తుడు వేషధారణలో ప్లే కార్డ్స్ ద్వారా  ట్రాఫిక్ రూల్స్ ని చూపిస్తూ ప్రజలకు ట్రాఫిక్ గురించి అవగాహన కలిగిస్తూ  టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి భీమా సర్కిల్, శ్రీనివాస భవన్ మీదుగా ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీలో పాల్గొన్న విద్యార్థుల ఫోటోలు

అక్షర శ్రీ జూనియర్ కాలేజీ లో జాతీయ రహదారి భద్రత మహోత్సవాలు సందర్భంగా ట్రాఫిక్ అవగాహన సదస్సు నిర్వహించరు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ ఘంటా సుబ్బారావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని,  18 సంవత్సరాలు లోపు స్టూడెంట్స్ బైకులు నడప రాదని, అదేవిధంగా విద్యార్థులు ఎటువంటి యు టీజింగ్, ర్యాగింగ్, సైబర్ నేరాలు, గంజాయి వంటి వాటికి పాల్పడకుండా మంచి మార్గంలో నడిచి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు
ఈ సందర్భంగా ఆదోని డీఎస్పీ మర్రిపాటి హేమలత మాట్లాడుతూ అందరూ తప్పనిసరిగా  ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాలు నివారించటంలో తోడ్పడాలని తెలియజేసినారు.

రోడ్ సేఫ్టీ పై విద్యార్థులకు అవగాహన కలిగిస్తున్న ట్రాఫిక్ సిఐ

ర్యాలీలో ట్రాఫిక్ సిఐ, టూ టౌన్  సిఐ, ఎస్సైలు,  సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading
News2 days ago

ఖాళీ బిందెలు కొళాయి ముందు పెట్టి నిరసన

News2 days ago

నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న బాలికల హాస్టల్ విద్యార్థినిలు

News2 days ago

అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీ సీజ్

News3 days ago

రోడ్ సేఫ్టీ పై వినూత్న రీతిలో విద్యార్థుల ప్రదర్శన

News3 days ago

కూటమి నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాలు

Business3 days ago

ఆదోని మార్కెట్ యార్డ్ లో తగ్గుతున్న పత్తి ధర

News3 days ago

రోడ్ సేఫ్టీ కమిటీ డివిజన్ స్థాయి సమావేశం

News3 days ago

రోడ్ సేఫ్టీ పై ఆర్ అండ్ బి అధికారి తో చర్చించిన డి.ఎస్.పి

News3 days ago

రోడ్ సేఫ్టీ అవగాహన ఆటో ర్యాలీ నిర్వహించిన పోలీసులు

News3 days ago

సంక్షేమ పథకాలు ఇవ్వలేను అని చెప్పటం సిగ్గుచే.. మాజీ ఎమ్మెల్యే

Trending