రైతులను నట్టేటా ముంచిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం దగాచేసి అన్నదాతా సుఖీభవ అంటూ పచ్చి మోసం ఏడాదికి రూ.20వేలు ఇస్తామంటూ సూపర్ సిక్స్ హామీ కనుమరుగు చేశారని ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్సిపి పార్టీకి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ మరియు పార్టీ నాయకులు అన్నదాత అండగా వైఎస్ఆర్సిపి పోస్టర్ను విడుదల చేశారు.
దగా చేస్తున్న కూటమి సర్కారుపై నిరసన గళం తెలపడానికి 13వ తేదీ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయానికి పెద్ద ఎత్తున రైతులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాలుగోనలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతు జగనన్న ఇచ్చిన రైతుభరోసాకూ ఎసరు పెట్టారని ఖరీఫ్ ముగిసింది, రబీ వచ్చింది అయినా అన్నదాత సుఖీభవ పెట్టుబడి సహాయం ఆచూకీలేని సహాయం అందక రైతులు గగ్గోలు పెడుతున్నారని బడ్జెట్లో రూ.10,700 కోట్లు పెట్టాల్సి ఉండగా దాని ప్రస్తావనే లేదు తెలిపారు. ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ జగనన్న హయాంలో ఏటా క్రమం తప్పకుండా డా. వైయస్సార్ రైతు భరోసా రైతు భరోసా కింద మేనిఫెస్టోలో పెట్టింది ఏడాది 12వేల 500 రూపాయలు కాని మరో వేయి పెంచి 13 వేల 500 రూపాయలు ఏడాదికి అందించిందని అన్నారు.