News
రైతుల సొంత భూములను రైల్వే భూములుగా ఎలా చూపిస్తారు
కర్నూలు జిల్లా ఆదోని మండలం కుప్పగల్ గ్రామంలో రెవెన్యూ అధికారులు రైతు సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రైతు సదస్సులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల అధ్యక్షుడు కే. శేఖర్ మరియు రైతులు రీ సర్వే డిప్యూటీ తాసిల్దార్ పెద్దయ్యకు రీ సర్వేలో భాగంగా రైతుల సొంత భూములను రైల్వే భూములుగా చూపించి, రైతు పేర్లు ఆన్లైన్ నుండి తొలగించారని వారి పేర్లను ఆన్లైన్లో చేర్చి, వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ తాసిల్దార్ పెద్దయ్య మాట్లాడుతూ మాకు 30 రోజులు వ్యవధి కావాలని ఆలోగా సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. రైతు సంఘం అధ్యక్షుడు శేఖర్ మాట్లాడుతూ 30 రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలని లేనిపక్షంలో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రైతులు సుభాన్, బోజప్ప, తదితరులు పాల్గొన్నారు.
News
ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడులు
కర్నూలు జిల్లా ఆదోని సబ్ రిజిష్టర్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు దాడులు నిర్వహించారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని అధికారులతో ప్రైవేట్ వ్యక్తులతో అనధికారికంగా ఉన్న 1లక్ష 18 వేల 700 వందల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్సీ సీతారామారావు తెలిపారు.
డీఎస్పీ సీతారామారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో భారీ ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లు వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం రావడంతో ఈ దాడులు ఆకస్మికంగా నిర్వహించామని అన్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇద్దరు అధికారులు నలుగురు అనధికారులు, ముగ్గురు డాక్యుమెంట్ రైటర్లు వారి అసిస్టెంట్లు మరియు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఇద్దరు ప్రవేటు వ్యక్తులు ఉన్నారని వారిని విచారిస్తున్నామని తెలిపారు. ఈ దాడుల్లో సీఐ కృష్ణయ్య వారి సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు.



News
జగన్ 2.0 యాప్ పోస్టర్ ఆవిష్కరన
కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో జగన్ 2.0 యాప్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలపై కూటమి నాయకులు చేస్తున్న అరాచకాలను ఈ యాప్ ద్వారా జగన్మోహన్ రెడ్డి కి తెలుపవచ్చు అన్నారు. పోస్టర్ విడుదల కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

News
BREAKING ఏపీలో సర్ గడువు 24 వరకు పొడిగింపు
ఏపీలో SIR గడువును పొడిగిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఇవాల్టితో గడువు ముగియనుండగా కొన్నిచోట్ల ప్రక్రియ పూర్తికాలేదు. దీంతో అన్ని పార్టీల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని ఈ నెల 24 వరకు గడువును పొడిగిస్తున్నట్లు తెలిపింది.

-
News1 week agoఆదోని నూతన ఆర్డీవో గా బాధ్యతలు స్వీకరించిన కె. అరుణా దేవి
-
News1 week agoకుప్పగల్ రైల్వేగేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి..
-
News1 week agoఆదోనిలో ఆసక్తికర ఘటన.. వైరల్గా మారిన ఎమ్మెల్యే వ్యాఖ్యలు
-
News4 weeks agoసూర్యుని చుట్టూ ఒక పెద్ద వృత్తాకార వలయం
-
News7 days agoతుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ
-
News4 weeks agoఅదోనిలో 30 లక్షలు విలువ చేసే 35 బైక్లు స్వాధీనం
-
News2 weeks agoవృద్ధురాలిని బావిలోకి తోసేసిన డిగ్రీ విద్యార్థి అరెస్ట్
-
News6 days agoతుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ
