కర్నూలు జిల్లా ఆదోనిలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలతో అలంకరించి విగ్రహం ముందు వైయస్సార్ సిపి నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గురువారం రాత్రి విజయవాడలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన గూండాలను అరెస్ట్ చేసి శిక్షించాలని నినాదాలు చేశారు.

నిరసన తెలుపుతున్న నాయకులు


వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షుడు బి. దేవా మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహులు మాట్లాడుతూ అర్ధరాత్రి విజయవాడలో ఉన్నటువంటి భారతరత్న డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయటానికి ప్రయత్నించిన టిడిపి అగ్రవర్ణాల గూండాలను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు లోకేష్ రెడ్ బుక్కులు పాలన నడుస్తుందని ఎక్కడ చూసినా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తూ ప్రజల మీద దాడులు చేస్తూ వైఎస్ఆర్సిపి నేతలను చంపుతూ రాక్షస ఆనందం పొందుతూన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు ప్రజలు దీన్ని తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు. విగ్రహాన్ని ధ్వంసం చేసే విధంగా కుట్రచేసిన దుండగులను అరెస్ట్ చేసే వరకు వైఎస్ఆర్సిపి పార్టీ నిరసన ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చలపతి భాస్కర్, ఫయాజ్, సిద్ధ, మల్లికార్జున, తాయన్న, నల్లారెడ్డి, దానం, వేణు, రామకృష్ణ, రమేష్, ఈరన్న, రైల్వే ఈరన్న, నాగరాజ్, గంగాధర్, కోదండ, నరేష్, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *