News
దళిత మహిళను హత్య చేసిన ముద్దాయిలు అరెస్టు

కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాతన హల్లిలో జులై 12 తేదీ గుండమ్మ అనే దళిత మహిళ హత్య కేసులో 6 మంది నిందితులను డీఎస్పీ శివ నారాయణ స్వామి అరెస్టు చేసి విలేకరుల ముందు హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు. డిఎస్పి తెలుగుని వివరాల మేరకు గుండమ్మ అనే మహిళను ట్రాక్టర్ తో గుద్ది ఆమెపై ట్రాక్టర్ ఎక్కించి చంపారని మరియు పురుషోత్తమ్ రెడ్డిని కట్టే తో కొట్టి తీవ్రంగా గాయపరిచిన ముద్దాయిలను ఆదోని పట్టణం సిరుగుప్ప క్రాస్ రోడ్డు దగ్గర A1 ). జడ్ల శ్రీధర్ రెడ్డి, A2). జడ్ల రాఘవేంద్ర రెడ్డి, A3). జడ్ల సోమ శేఖర్ రెడ్డి, A4). బి. సుబ్బా రెడ్డి @బిసెటి సుబ్బా రెడ్డి, A5). హెబ్బటం రామకృష్ణ @ బోయ రామకృష్ణ, A6). దాసరి గోవిందరాజు @ దాసరి గోవిందు లను అరెస్టు చేసి జుడిషియల్ కోర్టు జడ్జి ముందు హాజరు పరిచయం రిమాండ్కు తరలిస్తున్నామని అదేవిధంగా హత్యకు ఉపయోగించిన AP99-TU- 0407 ట్రాక్టర్ ను సీజ్ చేసినట్లుగా తెలిపారు.
పూర్తి వివరాల్లోకి వెళితే:
డిఎస్పి శివ నారాయణ స్వామి తెలిపిన వివరాల మేరకు నాగనాతనహళ్లి గ్రామం సర్వేనెంబర్ 500/ D లోని 04 ఎకరాల పొలమును తిరుమలమ్మ W/o సోమశేఖర్ రెడ్డి నుండి నాగనాతనహళ్లి గ్రామానికి చెందిన మాదిగ గుండమ్మ W/o శ్రీనివాసులు అను ఆమె 2019 సంవత్సరం లో భూమి కొనుగోలు చేసి, 2022వ సంవత్సరంలో ఆమె కొడుకైన N. కిషోర్ కుమార్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకొన్నారు. అయితే ఈ భూమి విషయంగా గతంలో తిరుమలమ్మ మరియు రాఘవేంద్ర రెడ్డి కి మధ్య వివాదాలు ఉండడంతో ఆదోని సివిల్ కోర్టు నందు సివిల్ కేసు నంబరు O.S No: 50/17 గా వ్యాజ్యము నడుస్తూన్నాయి. వివాదాలు ఉండడం వల్ల భూమిని తిరుమలమ్మ, గుండమ్మకు అమ్మడంతో అప్పటినుండి భూమిని గుండమ్మ సాగు చేసుకుంటూ ఉన్నది. ఈ క్రమంలో జులై 12 తేదీ ఉదయం గుండమ్మ ఆమె కుమారుడు కిషోర్ మరియు కల్లుబావికి చెందిన పురుషోత్తం రెడ్డి ముగ్గురు పొలము వద్ద ట్రాక్టర్ తో ఉన్న సమయంలో నాగనాతనహళ్లి కి చెందిన రాఘవేందర్ రెడ్డి మరియు అతని కుమారుడు శ్రీధర్ రెడ్డి మరియు ఇంకా 4 వ్యక్తులు తమ ట్రాక్టర్ తీసుకుని గుండమ్మ దున్నుతున్న పొలం వద్దకు వెళ్లి ఆ భూమి మాకు కూడా చెందుతుందని మేము కూడా దున్నుతామని గుండమ్మతో వాదిస్తూ రాఘవేంద్ర రెడ్డి కుమారుడు శ్రీధర్ రెడ్డి తన ట్రాక్టర్ తో గుద్ది. ఆమెపై ట్రాక్టర్ ను ఎక్కించి చంపినాడు, మరియు రాఘవేందర్ రెడ్డి కట్టే తో పురుషోత్తమ్ రెడ్డిని కొట్టి తీవ్రంగా గాయపరిచారు.
గుండమ్మ కొడుకైన N. కిషోర్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆదోని రూరల్ CI, G. నిరంజన రెడ్డి గారు పై ఫిర్యాదు పై ఇస్వి పి.ఎస్ Cr.No. 101/2024 U/Sec 103, 109, 329(3), r/w 3(5) BNS and Sec 3(1)(f)(s), 3(2)(v) of SC/ST (POA) Amendment Act-2015 కేసు నమోదు చేశారు.
కర్నూల్ జిల్లా SP కృష్ణకాంత్ పర్యవేక్షణలో దర్యాప్తు అదికారి అయిన SDPO జె. శివనరాయణస్వామి, ఆదోని 2 టౌన్ CI గోపి, ఆదోని రూరల్ CI నిరంజన రెడ్డి, ఇస్వి SI శ్రీనివాసులు 15-07-2024వ తేదీన ఉదయం 11.00 గంటల, ఆదోని టౌన్ లోని, సిరుగుప్ప క్రాస్ రోడ్డు దగ్గరలో ముద్దాయులు
A1 ). జడ్ల శ్రీధర్ రెడ్డి, తండ్రి పేరు జడ్ల రాఘవేంద్ర రెడ్డి, వయసు 19 సంలు, నాగనాతనహళ్లి గ్రామము, ఆదోని మండలం,
A2). జడ్ల రాఘవేంద్ర రెడ్డి, వయస్సు 53 సంలు తండ్రి పేరు లేట్ శివ శంకర్ రెడ్డి, నాగనాతనహళ్లి గ్రామము, ఆదోని మండలం,
A3). జడ్ల సోమ శేఖర్ రెడ్డి, వయస్సు 42 సంలు తండ్రి పేరు లేట్ శివ శంకర్ రెడ్డి, నాగనాతనహళ్లి గ్రామము, ఆదోని మండలం,
A4). బి. సుబ్బా రెడ్డి @బిసెటి సుబ్బా రెడ్డి, వయసు 50 సంలు, తండ్రి పేరు చెన్నా రెడ్డి, నాగనాతనహళ్లి గ్రామము, ఆదోని మండలం,
A5). హెబ్బటం రామకృష్ణ @ బోయ రామకృష్ణ, వయసు 40 సంలు, తండ్రి పేరు నాగప్పు, నాగనాతనహళ్లి గ్రామము, ఆదోని మండలం,
A6). దాసరి గోవిందరాజు @ దాసరి గోవిందు, వయసు 27 సంలు, తండ్రి పేరు తిమ్మయ్య@ తిమ్మప్ప, నాగనాతనహళ్లి గ్రామము, ఆదోని మండలం.
వీరిని అదుపులోకి తీసుకొని విచారించి వారి నుండి హత్యకు ఉపయోగించిన ట్రాక్టర్ AP99-TU- 0407 ను మరియు కట్టెను సిరుగుప్ప క్రాస్ సమీపంలో వైపుల భాస్కర్ రెడ్డి ఖాళీ పొలంలోగల ముళ్ళ పొదలలో పంచాయతీదారుల సమక్షంలో స్వాదినం చేసుకొని ముద్దాయిలను అరెస్టు చేసి ఆదోని రెండవ అదనపు JFCM కోర్ట్ జడ్జి ముందు హాజరు రిమాండ్ కు తరలించారు.

News
శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్

కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.


News
16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.


News
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.


-
News2 weeks ago
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా
-
News3 weeks ago
భారీ వర్షనికి రామజల చెరువు నిండి ఇళ్లలోకి నీరు
-
News3 weeks ago
తుంగభద్ర డ్యాంకు పెరుగుతున్న వరద నీరు 27-09-2025
-
News3 weeks ago
ఆదోని డివిజన్లో కురిసిన వర్షపాతం
-
Business4 weeks ago
రోజు రోజుకు పతనమవుతున్న పత్తి ధర..
-
Business4 weeks ago
Gold, Silver Price బంగారు ధర
-
Business4 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
-
Business4 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు