News
చదువుకు దూరం అవుతున్న బడుగు విద్యార్థినిలు
కర్నూలు జిల్లా ఆదోనిలో విద్యార్థినిలు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది హాస్టల్ వసతి లేకపోవడం వల్ల గ్రామీణ విద్యార్థులు ఉన్నత చదువులు చదవలేక మధ్యలోనే మానేసి బాల కార్మికులుగా మిగిలిపోతున్నారు. తరగతులు ప్రారంభమై 20 రోజులు గడిచిన హాస్టల్ వసతి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. చేసేదేమీ లేక చదువులు మధ్యలోనే ఆపేసే పరిస్థితి ఉందని బీసీ విద్యార్థినుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. నియోజకవర్గంలో చాలా గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల ప్రతి రోజు ఆటో చార్జీలు చెల్లించుకోలేక స్కూళ్లకు డుమ్మ కొడుతున్న పరిస్థితి ఉంది.

అలాంటి పరిస్థితి రానివ్వకుండా ప్రతి విద్యార్థినికి హాస్టల్ వసతి కల్పిస్తామని ఎమ్మెల్యే పార్థసారథి గత నెల 22న మాటిచ్చారు ఆయన మాటలు నమ్మి నియోజకవర్గంలోని ఆయా గ్రామాల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్లో ఉన్నత విద్య అభ్యాసన కోసం చేర్పించారు.

నెరవేరని ఎమ్మెల్యే హామీ: డివిజన్ కేంద్రమైన ఆదోనిలో అద్దె భవనంలోనైనా బీసీ హాస్టల్ కొనసాగేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పార్థసారథి గత నెల 22న పత్రికాముఖంగా హామీ ఇచ్చారు. హరులైన విద్యార్థినిల నుండి హాస్టల్ వసతి కోసం దరఖాస్తులు స్వీకరించాలని సోషల్ వెల్ఫేర్ అధికారులకు ఆదేశించారు. ఆ సూచన మేరకు ఆదోని పట్టణంలోనే ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్ ప్రాంగణంలో ఉన్న ఎస్సీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ అధికారులకు తల్లిదండ్రులు దరఖాస్తుల సమర్పించారు. ఇప్పటివరకు సుమారుగా 160 మంది విద్యార్థినిలు దరఖాస్తులు చేసుకున్నారు. తరగతులు గత నెల 13న ప్రారంభమయ్యాయి, ఇప్పటివరకు హాస్టల్ సదుపాయం లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుండి రోజు చదువుకోడానికి ఆదోనికి వచ్చేందుకు నాన ప్రయాసలు పడాల్సి వస్తుందని విద్యార్థులు చెబుతున్నారు దరఖాస్తు చేసుకున్న వారందరికీ సదుపాయం కల్పించాలని కోరుతున్నారు. దరఖాస్తు చేసుకున్న వారందరూ రోజు ఇంటిగ్రేటెడ్ హాస్టల్ చుట్టూ తిరుగుతున్న అక్కడ ఉద్యోగుల నుండి సరైన సమాధానం రాకపోవడంతో నిరుత్సాహానికి లోనవుతున్నారు. ఇచ్చిన హామీ మేరకు ఆరో తరగతి నుండి పదవ తరగతి చదివే బిసి విద్యార్థినులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఆ దిశగా ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


విద్యార్థులందరికీ వసతి కల్పించాలి: శ్రీనివాసులు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఆదోని
డివిజన్ కేంద్రమైన ఆదోనిలో చదువుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి నుండి పదవ తరగతి చదువే గ్రామీణ విద్యార్థులకు తప్పనిసరిగా హాస్టల్ వసతి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది బీసీ హాస్టల్ నిర్వాణకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఎంతో హర్షించారన్నారు. ఎమ్మెల్యే హామీ ఇచ్చి రోజులు గడిచిన ఎలాంటి చర్యలు కనపడలేదు దరఖాస్తు చేసుకున్న వారందరూ హాస్టల్ సీటు కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి దరఖాస్తు చేసుకున్న బిసి బాలిక విద్యార్థులందరికీ హాస్టల్ వసతి కల్పించాలని లేనియెడల ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్‌ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




