కర్నూలు జిల్లా ఆదోని లో పోలీసుల అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేసిన డి.ఎస్.పి శివ నారాయణ స్వామి, సిఐలు, ఎస్సైలు, పోలీసులు.
డీఎస్పీ శివ నారాయణ స్వామి మాట్లాడుతూ అక్టోబర్ 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగా ప్రతిరోజు వివిధ రకాల కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు వచ్చి చేరువయ్యే విధంగా ర్యాలీలు ఎస్సే రైటింగ్ లు చేపట్టామని తెలిపారు చివరి రోజు కావడంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ప్రతి ఒక్క పోలీసు డిపార్ట్మెంట్లో ఉన్నవారు రక్తదానం చేశారని తెలిపారు. ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ప్రాణాలు కాపాడిన అమరవీరులను స్మరించుకుంటూ ఆదోని డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులు రక్తదానం చేయడం జరిగిందని తెలిపారు.