కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని హిందూ స్మశాన వాటిక లో మృతదేహాలను దహనం చేసే బిల్డింగుకు 2020-21వ సంవత్సరములలో 14వ వార్షిక నిధులు కోటి రూపాయల విడుదల కాగా ఆ నిధులను నామమాత్రంగా ఖర్చు చేసి నిధులను స్వాహా చేశారని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే. అజయ్ బాబు ఆరోపించారు. అవినీతి ఆక్రమణలకు పాల్పడినటువంటి అధికారులను మరియు కాంట్రాక్టర్లల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని , వారు దోచుకున్నటువంటి సొమ్మును రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని సిపిఎం పార్టీ నాయకులు హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి పట్టణాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిధులు కేటాయిస్తే వాటిని కాంట్రాక్టర్లు అధికారులు పనులు చేయకుండా పనులు చేసినట్లు చూపించి నిధులను స్వాహా చేస్తున్నారు అని సిపిఐ పట్టణ మండల కార్యదర్శి లు సుదర్శన్, విమర్శించారు.
ఈ కార్యక్రమంలో కల్లుబావిరాజు, సహాయ కార్యదర్శి విజయ్, ఏ ఐ టి యు సి పట్టణ అధ్యక్ష కార్యదర్శులు భీమేష్, వెంకన్న, సహాయ కార్యదర్శి ప్రకాష్ సిపిఐ పార్టీ నాయకులు పుష్పరాజు, అయ్యన్న స్వామి తదితరులు పాల్గొన్నారు.