కర్నూలు జిల్లా అదోని తిరుమల నగర్ లో హైటెక్ వ్యభిచారాం నిర్వహిస్తున్న గృహం పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఇద్దరు నిర్వాహకులు , ఏడుమంది విటులు లను అరెస్ట్ చేసి వారివద్ద నుండి 2 సెల్ ఫోన్ లు, 1200 వందల నగదు స్వాధీనం చేసుకున్నారు.
సిఐ నరసింహారాజు తెలిపిన వివరాల మేరకు గత కొన్నేళ్లుగా హైటెక్ వ్యభిచారం గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారని అమ్మాయిలను కలకత్తా , కర్నూలు , ధర్మవరం , ముంబయి నుండి రప్పిస్తున్నరాని తెలిపారు. ఆదోని కి చెందిన 1. సఫారీ అనూష ఉర్ఫ్ ఉషా, 2.మంగలి భాగ్యమ్మ ఉర్ఫ్ భాగ్యలక్ష్మి ఉర్ఫ్ జ్యోతి ఇద్దరు కలిసి ఈ వ్యభిచార గృహాన్ని నడుపుతున్నారని ఈ దాడుల్లో ఆదోని చెందిన ముగ్గురు విటులు ఉప్పార గోపాల్, వడ్డే నారాయణ కటిక జుబేర్ ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన షేక్ అమాన్ వలి, చాకలి బతకప్ప, కే. నాగరాజు, వై. వీర్ కుమార్ నలుగురు విటులు లను అరెస్టు చేసి రిమైండ్ కి తరలిస్తా మని సిఐ నరసింహారాజు తెలిపారు.