Connect with us

News

మినీ గోకులం షెడ్లకు సబ్సిడీ రుణాలు

Published

on

రేషన్‌ కార్డు కలిగి ఉన్న ఎస్సీ, ఎస్టీ, సన్నచిన్న కారు రైతులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవచ్చు.

పశుపోషణ చేసుకునే రైతులకు ప్రభు త్వం మినీగోకులం పథకం ద్వారా షెడ్లను నిర్మించుకోవడానికి సబ్సిడీ రుణాలు అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సన్న, చిన్న,పేద రైతులు తాము పెంచుకుంటున్న పాడి పశువులకు సరైన వసతి కల్పించలేకపోతున్నారని, దీంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం సబ్సిడీపై రుణాలు అందిస్తోంది. రెండు పశువులకు రూ.లక్షన్నర, నాలుగు ఉన్న వారికి రూ.1.85 లక్షలు, ఆరు పశువులకు రూ.2.30 లక్షలు యూనిట్‌కు మంజూరు చేస్తోంది. యూనిట్‌ ఖర్చు మొత్తంలో 10శాతం రైతులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. మిగిలిన సొమ్మును ఉపాధి హామీ పథకం ద్వారా విడుదల చేస్తోంది. రేషన్‌ కార్డు కలిగి ఉన్న ఎస్సీ, ఎస్టీ, సన్నచిన్న కారు రైతులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవచ్చు. షెడ్‌ ఏర్పాటుకు అవసరమైన స్థలం, ఉపాధి హామీ జాబ్‌కార్డు, బ్యాంకు అకౌంట్‌ కలిగి ఉండాలి. గ్రామాల్లో పశువైద్యాధికారుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Continue Reading
1 Comment

1 Comment

  1. Raghava

    30/08/2024 at 8:13 pm

    Why you highly reference to st se what about govt employees, most of people are oc also low income 😕
    Cristins also well settled, check income and do the needful who was suffering ,
    No labers working at villages because only your unnecessary pinchan amount based , but Ex: toordal cost 180/- is this your raithu barosa status worst poltics…
    Ycp: politics also no 1 worst options

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

13 మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

Published

on

కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ సీఐ శ్రీరామ్ అంతరాష్ట్ర దొంగలముఠాను అరెస్టు చేసి కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ముందు హాజరు పరిచారు. 13 మందిని అరెస్టు చేసి వీరి వద్ద నుండి భారీగా ప్రాపర్టీని రికవరీ చేశారు. ఈ ముఠా నుంచి 21 కేసులలో దొంగలించబడిన 478.7 గ్రాముల బంగారు ఆభరణాలు (రూ. 33 లక్షల 7 వేల 8 వందల విలువ)  రూ. 8 లక్షల 4 వేల నగదు మొత్తము సుమారు రూ.41 లక్షల, 11 వేల, 8 వందల ప్రాపర్టీ  స్వాధీనం చేసుకున్నరు.

దొంగల ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు

ప్రాపర్టీ రికవరీలో ప్రతిభ కనబరచిన ఆదోని ఒకటవ పట్టణ సిఐ శ్రీరామ్, ఎస్సై రామస్వామి , పోలీసుసిబ్బందిని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ బిందు మాధవ్ అభినందించి, రివార్డులు అందజేశారు.

దొంగల ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న నగదు
జిల్లా ఎస్పీ బిందు మాధవ్ స్వాధీనం చేసుకున్న నగదును వివరిస్తున్న డి.ఎస్.పి సీఐ
మీడియా ముందు నగదును ప్రదర్శించిన ఎస్పీ
పోలీసులకు రివార్డులు అందజేస్తున్న జిల్లా ఎస్పీ బిందు మాధవ్
Continue Reading

News

ఏసీబీ వలలో కమర్షియల్ టాక్స్ ఆఫీసర్

Published

on

లక్షా 50 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఒంగోలు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసు డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్.. కే.ఎస్. శ్రీనివాస ప్రసాద్.
ఒంగోలు ఎసిబి డిఎస్పి రామచంద్రరావు తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయి. సిహెచ్ శ్రీధర్ ట్రేడ్ కంపెనీకి నోటీసు ఫెనాల్టీ వేసి ఆ పెనాల్టీ లేకుండా చేసేందుకు ఒంగోలు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసు డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ కే.ఎస్. శ్రీనివాస ప్రసాద్ లక్షా యాభై వేల రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో సిహెచ్ శ్రీధర్ ట్రేడ్ కంపెనీ యజమానులు ఏసీబీని ఆశ్రయించారు. అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ లంచం  తీసుకుంటుండగా ఒంగోలు ఏసిబి డిఎస్పి పి. రామచంద్రరావు తన సిబ్బందితో కలిసి దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ ఇన్స్పెక్టర్ శేషు, ఎస్ఐ లు జే.బీ.ఎన్ ప్రసాద్, షేక్. మస్తాన్ షరీఫ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading

News

కన్న కూతురిని కడ తేర్చిన కసాయి తండ్రి

Published

on

మధ్యనికి బానిసై కుటుంబాలు కోల్పోతున్నారు. మద్యం మత్తులో నేరస్తులుగా మారుతున్నారు.
కర్నూలు జిల్లా అస్పరి (మం) తంగరడోణ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిని కడ తేర్చిడు కసాయి తండ్రి. కన్న కూతురు మౌనిక (10) ను తాడుతో గొంతు నులిమి హత్య చేసిన తండ్రి వీరేష్. మద్యం మత్తులో భర్త పెట్టే వేధింపులు తట్టుకోలేక  బార్య పద్మ ఇటీవలే పుట్టింటికి వెళ్ళిపోయింది.

మృతురాలు మౌనిక

బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మద్యం కోసం ఇంట్లో దాచిన డబ్బు తీసుకుతుండగా కూతురు మౌనిక అడ్డుకొని డబ్బు తీసుకున్న విషయం నాన్నమ్మ కు చెబుతానని చెప్పడంతో తాగిన మత్తులో దొంగతనం గురించి తన తల్లికి చెబుతుందోమేనని తాడుతో గొంతు బిగించి హత్య చేశాడని బంధువులు తెలిపారు.

ఏరియా హాస్పిటల్ వద్ద మృతురాలి బంధువులు

పోస్టుమార్టం నిమిత్తం బాలిక మృతదేహాన్ని ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆస్పరి పోలీసులు వీరేశ్ పై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

పోస్టుమార్టం రూమ్ వద్ద బంధువులు
Continue Reading

Trending