News
లింగ నిర్దారణ చేసే స్కానింగ్ కేంద్రాలపై ఉక్కుపాదం
◆ లింగ నిర్దారణ చేసే స్కానింగ్ కేంద్రాలపై సమాచారం అందించిన వారికి నగదు బహుమతి..
◆ నిబంధనలు ఉల్లంగించిన వారిపై 50 వేలు జరిమాన నుండి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష..
◆ లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ కేంద్రాలను ఉపేక్షించొద్దు..
◆ రానున్న రోజుల్లో లింగ నిర్ధారణ, భ్రూణ హత్యలు, పీసీ పీఎన్డీటీ చట్టంపై అవగాహన కార్యక్రమాలు..
కర్నూలు జిల్లా అదోనిలో బుధవారం సబ్ కలెక్టర్ ఛాంబర్ నందు భృణ హత్యలు నివారించడం పీసీ పీఎన్డీటీ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో పీసీ పీఎన్డీటీ చట్టంపై సబ్ డివిజనల్ సలహా కమిటీ సమావేశంలో సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఆదోని డీఎస్పీ శివ నారాయణ, ఎమ్మిగనూరు డిఎస్పి సీతారామయ్య డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. సత్యావతి, డిస్టిక్ మానిటరింగ్ కన్సల్టెంట్ సుమలత పాల్గొన్నారు. ఆదోని డివిజన్ పరిధిలో 42 స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయని సమాజంలో లింగ అసమానతలకు కారణమవుతున్న భ్రూణ హత్యలను సంపూర్ణంగా నివారించేందుకు కృషిచేయాలని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పిలుపునిచ్చారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ పీసీ పీఎన్డీటీ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని సబ్ కలెక్టర్ డిప్యూటీ డిఎంహెచ్వో సత్యవతి ను ఆదేశించారు.
సమావేశంలో సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ మాట్లాడుతూ తల్లిందండ్రుల ఆలోచనా విధానంలో మార్పులు తీసుకురావడం ద్వారానే భ్రూణ హత్యలను నివారించగలమన్నారు. రానున్న రోజుల్లో గర్భస్థ శిశువులపై లింగ వివక్షకు వ్యతిరేకంగా, పీసీ పీఎన్డీటీ చట్టంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. లింగ నిర్దారణ చేసే స్కానింగ్ కేంద్రాలపై సమాచారం అందించిన వారికి 25 వేల నుండి లక్ష రూపాయల వరకూ నగదు బహుమతి అందిస్తామని నిబంధనలు ఉల్లంగించిన వారిపై 50 వేలు జరిమాన నుండి 3 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని తెలిపారు.
ఆదోని డివిజన్ పరిధిలో ఉన్న 42 స్కానింగ్ కేంద్రాలను ప్రతి 3 నెలలకు ఒకసారి తనిఖీ చేసి నూతన రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్, సిబ్బంది, చిరునామా, పరికారాల్లో మార్పులు వంటి అంశాలపై తనిఖీ చేసి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా స్కానింగ్ సెంటర్లను అనుమతులు రద్దు హెచ్చరించరు.
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్‌సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్‌సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్‌సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్‌సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్‌ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




