News
ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ : లిక్కర్ స్కామ్ లో జైలులో ఉన్న కవితకు నేడు బెయిల్ లభించింది. సుప్రీం కోర్టు నేడు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వ నాథన్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కవిత తరపున సీనియర్ న్యాయ వాది ముకుల్ రోహత్గా, ఈడీ తరపున ఏఎస్పీ వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది.
కవితకు బెయిల్ పొందే అర్హత ఉందని తెలిపారు.
ఇప్పటికే కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగి శాయని రోహత్గీ తెలిపారు. ఈడీ, సీబీఐ కేసులో ఇప్ప టికే విచారణ పూర్తయ్యిం దని న్యాయ వాది ముకుల్ రోహత్గీ తెలిపారు. ఈడీ కేసులో 5 నెలలుగా కవిత జైల్లో ఉన్నారని అన్నారు. సీబీఐ కేసులో 4 నెలలుగా జైలులో ఉన్నా రని చెప్పారు. ఈ కేసులో మొత్తం 493 మంది సాక్షుల విచారణ ముగిసిం దని అన్నారు. కేసులో ఛార్జ్‌షీట్లు కూడా దాఖలు చేశారని తెలిపారు. కవిత దేశం విడిచి పారిపోయే అవకాశం లేదని రోహత్గీ అన్నారు. కవితకు బెయిల్ పొందే అర్హత ఉందని తెలిపారు. రూ.100 కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలు మాత్రమే అని తెలిపారు.
దర్యాప్తు సంస్థలు అడిగిన ఫోన్లను కవిత ఇచ్చారని పెరుకొన్నారు. ఫోన్లు మార్చ డంలో తప్పేముందని ప్రశ్నించారు. సౌత్ గ్రూప్ 100 కోట్లు అంటున్నారని.. కానీ దాన్ని రికవరీ చేయలే దని తెలిపారు. 493 మంది సాక్షులను విచారించారని అన్నారు. సాక్షులను బెదిరించారని చెబుతున్నారని. కానీ ఎక్కడా ఎందుకు కేసులు నమోదు కాలేదని ప్రశ్నించారు. కవిత ఎవరినీ బెదిరించలేదని స్పష్టం చేశారు. విచారణలో తీవ్ర జాప్యం జరుగుతుందని సిసోడియాకు ఇచ్చిన బెయిల్ అంశాలే కవితకు వర్తిస్తాయని తెలిపారు. ధర్మాసనం .కవితను రెండేళ్లుగా వాడిన మొబైల్ ఫోన్ల ను అడిగామని, కవిత వాటిని ఇచ్చారని తెలిపారు .అయితే మొబైల్ ఫోన్లను ఫార్మాట్ చేసారా? డేటా డిలీట్ చేసారా అని అడిగామని, అందుకు కవిత తనకు తెలీదు అన్న సమాధానాలు ఇచ్చారన్నారు.
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్‌ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




