Day: July 27, 2026

​బీసీ వసతి గృహాల్లో ఆర్డీవో అరుణ దేవి ఆకస్మిక తనిఖీ

ఆదోని, జూలై 27: ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన వసతులు, విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కర్నూలు జిల్లా ఆదోని రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) కె. అరుణ దేవి తెలిపారు. సోమవారం ఆదోని పట్టణంలోని బీసీ బాలుర, కళాశాల బాలికల వసతి గృహాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టళ్లలో ఆహార నాణ్యత, వంటశాలల శుభ్రత, తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణతో పాటు రికార్డులు, విద్యార్థుల హాజరును పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో నేరుగా […]

రైలు కింద పడి నవవరుడు ఆత్మహత్య

కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ శివరామయ్య తెలిపిన వివరాల ప్రకారం… ఆదోనిలోని ఇంద్రానగర్ కాలనీకి చెందిన ఉపేంద్ర (తండ్రి: లక్ష్మన్న) అనే యువకుడు జులై 26వ తేదీ (ఆదివారం) రాత్రి 10 గంటల సమయంలో ఆదోని – నగరూరు రైల్వే స్టేషన్ల మధ్యన ఉన్న కేఎం నంబర్ 492/23-25 వద్ద అప్‌లైన్ రైల్వే ట్రాక్‌పై పడి […]

​ఆదోని క్రికెట్ ఆటగాళ్ల ప్రతిభ – సౌత్ జోన్ జట్లకు ఎంపిక

ఆదోని క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన పలువురు క్రీడాకారులు సౌత్ జోన్ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ నెల జూలై 29 నుండి ఆగస్టు 8 వరకు కడపలో జరగనున్న అండర్-19 సౌత్ జోన్ మ్యాచ్‌లకు ఆదోనికి చెందిన మల్లికార్జున ఎంపికయ్యాడు. అలాగే, అండర్-15 బాలికల సౌత్ జోన్ జట్టుకు వై. మేఘనా రెడ్డి, ఎన్. లావణ్య ఎంపికయ్యారు. సౌత్ జోన్ జట్లకు ఎంపికైన ఈ ముగ్గురు క్రీడాకారులను ఆదోని క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు […]

భారీ రావిచెట్టు నేలకొరిగింది.. తప్పిన పెను ప్రమాదం

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం హవనపేట వీధి లో ఉన్న వెంకట నర్సప్ప ఆలయ ప్రాంగణంలో భారీ రావిచెట్టు సోమవారం ఉదయం సుమారు 7:30 గంటలకు ఒక్కసారిగా నేలకొరిగింది. ఉదయం వేళ రాకపోకలు తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు. చెట్టు కొమ్మలు ఇద్దరు వ్యక్తులకు సులభంగా గాయాలైనట్లు తగిలినట్లు స్థానికులు వెల్లడించారు. అయితే ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని సమాచారం. భారీ చెట్టు కూలిపోవడంతో సమీపంలోని విద్యుత్ వైర్లు తెగి రోడ్డుపై పడిపోయాయి. […]

తుంగభద్ర డ్యాంకు పెరుగుతున్న వరద నీరు

హోస్పేట: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జులై 27 (సోమవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1607.32 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 32.596 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రవాహాల వివరాలు: గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే […]

Back To Top