కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఎరిగేరి గ్రామంలో తీవ్రమైన తాగునీటి సమస్య ఉందని స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు , అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్తులు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు. ఎన్ని సార్లు చెప్పిన నాయకులకు అధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్య పరిష్కరించేంతవరకు రోడ్డుపై నుంచి కదిలేది లేదని కటాకండిగా చెప్పడంతో అధికారులు గ్రామ నాయకులు అక్కడికి చేరుకొని సర్ది చెప్పి 45 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని ఎంపీడీవో నాయకులు గ్రామస్తులకు హామీ ఇచ్చిరు.