News
ఆదోని అభివృద్ధివైపు అడుగులు
వాహన దారులకు రోడ్డు భద్రత పై అవగాహన కల్పించి, ప్రమాదాలు జరగకుండా పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు.
కర్నూలు జిల్లా అదోనిలో మంగళవారం సబ్ కలెక్టర్ వారి కార్యాలయం సమావేశ మందిరంలో ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అధ్యక్షతన డివిజన్ స్థాయి రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ గత సమీక్షలు జరిగిన రోడ్ సేఫ్టీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి ఆరా తీశారు. ముఖ్యంగా డివిజన్ పరిధిలో రోడ్లపై ఉన్న గుంతలను యుద్ధ ప్రాతిపదన పూడ్చాలని ఆర్ అండ్ బి అధికారులకు సబ్ కలెక్టర్ ఆదేశించారు. ఆదోని పట్టణంలో పార్కింగ్ సమస్య ఎక్కువ ఉన్నందువలన వాటిపై ప్రత్యేకమైన దృష్టి సారించాలని ముఖ్యంగా నో పార్కింగ్ ఏరియాలో పార్కింగ్ చేయకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు.
ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ ఆదోని అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా ఆక్రమణకు గురైన ప్రభుత్వ రహదారులు ప్రభుత్వ భవనాలను త్వరగతిన గుర్తించి తక్షణమే ప్రభుత్వ నిబంధనల మేరకు పరిశీలించి వాటిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. రాబోయే రోజుల్లో అధిక వర్షపాతం పడే సూచన ఉన్నందువలన లోతట్టు ప్రాంతాలను గుర్తించి అక్కడ ఉన్న డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించి ఏటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వాటిపై చర్యలు తీసుకొని అవసరమైన మేరకు కొన్ని పరిస్థితులను సుమోటో గా కంప్లైంట్ తీసుకొని శాంతిభద్రతలు పరిరక్షించాలన్నారు. ముఖ్యంగా రాంజుల చెరువులో ప్రస్తుతం ఉన్న నీటిని తొలగించి వర్షపు నీటిని ప్రతి చుక్కను సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు.
ఈ కార్యక్రమానికి కార్యాలయపు పరిపాలన అధికారి సి ఆర్ శేషయ్య, ఆదోని డీఎస్పీ శివ నారాయణ స్వామి, ట్రైని డిఎస్పి ధీరజ్, మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి, నేషనల్ హైవే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శంకర్ రెడ్డి, ఆర్టీవో నాగేంద్ర, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ షీశిర దీప్తి, ఆర్టీసీ డిపో మేనేజర్ మహమ్మద్ రఫీ, , పోలీసు, రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్‌ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




