News
వేరుశనగ పొట్టు యంత్రంలో పడి కార్మికుడు మృతి

కర్నూలు జిల్లా ఆదోని శివారు మహాగౌరి ఫ్యాక్టరీ లో దారుణం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు (వేరుశనగ పొట్టు యంత్రం) కన్వేయర్ యంత్రం లో ఇరుక్కుని కడితోట గ్రామానికి చెందిన మాల రాఘవేంద్ర అనే కార్మికుడు దుర్మరణం చెందాడు. కడితోట గ్రామానికి చెందిన మాల రాఘవేంద్ర , బార్య లక్ష్మి గత పదేళ్లుగా పని చేస్తున్నారు.ఇటీవలే అతనితో పాటు కుమారుడు కూడా పనిలో చేరాడు. యదావిధిగా శుక్రవారం మధ్యాహ్నం అందరూ కలిసే భోజనం చేశారు.

ఐతే త్వరగా భోజనం చేసిన రాఘవేంద్ర మిషన్ లో పొట్టు వేయడానికి వెళ్ళాడు , కాసేపటికి కుమారుడు వీరేష్ వెళ్లి చూడగా తండ్రి యంత్రంలో ఇరుక్కుని విగత జీవిగా కనిపించడంతో వెంటనే మిషన్ ఆఫ్ చేసి గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న మరికొంత మంది కూలీలు అతి కష్టం మీద రాఘవేంద్ర మృత దేహాన్ని బయటకి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బార్య లక్ష్మి పిర్యాదు మేరకు ఇస్వీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.


News
స్కూల్ బస్సులు తనిఖీలు నిర్వహించిన అధికారులు

కర్నూలు జిల్లా ఆదోని లో మంగళవారం పోలీసులు మరియు ఆర్టీవో అధికారులు సంయుక్తంగా ప్రైవేట్ స్కూల్ బస్సులను తనిఖీ నిర్వహించారు. స్కూల్ బస్సులను, వాటికి సంబంధించిన రికార్డ్స్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా డిఎస్పి హేమలత మాట్లాడుతూ స్కూల్ యాజమాన్యానికి మరియు డ్రైవర్లకు తగు సూచనలు చేశారు. డ్రైవర్లు యూనిఫామ్ కలిగి ఉండాలని పిల్లల పట్ల మర్యాదగా ఉంటూ, డోర్ స్టెప్స్ దగ్గర పిల్లలు నిలబడకుండా మరియు కిటికీ లోంచి తలలు బయటికి పెట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిల్లలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇతనిఖిలలో ఆదోని డిఎస్పి హేమలత, ఆదోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శశిర దీప్తి, ట్రాఫిక్ సిఐ గంట సుబ్బారావు వారి సిబ్బంది పాల్గొన్నారు.



News
మందుబాబులపై కేసు నమోదు

కర్నూలు జిల్లా ఆదోనిలో మంగళవారం 01 వ తేదీన 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ శ్రీరామ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించరు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి ఎస్పీ ఆదేశాలతో డిఎస్పి హేమలత పర్యవేక్షణలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిచమని ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న 28 మందిపై మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ లో11 మంది పై మొత్తం 39 మంది పై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వీరిని బుధవారం ఉదయము కోర్టులో హాజరు పరుస్తామని మీడియాకు తెలిపారు.
News
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 01-07-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1624.38 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 74.486 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 28902 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 2389 క్యూసెక్కులు
-
News3 days ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 29-6-2025
-
News4 weeks ago
ఎరువుల అక్రమ రవాణా పై ఉక్కు పాదం
-
News2 days ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 30-6-2025
-
News19 hours ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 01-07-2025
-
News2 weeks ago
సంక్షేమ పథకాలు అమలు చేయడంలో టిడిపి పెట్టింది పేరు. గడ్డా ఫక్రుద్దీన్
-
News4 weeks ago
ఫిట్నెస్ లేని స్కూల్ బస్సుల యాజమాన్యం పై చర్యలు తీసుకోండి
-
News4 days ago
అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం మంజూరు
-
News4 weeks ago
రైతులకు రాయితీ వేరుశనగ పంపిణీ