Month: August 2026

రైతులను ఇబ్బంది పెడితే లైసెన్స్ రద్దు చేస్తాం

నిబంధనలు ఉల్లంఘిస్తే దళారీల లైసెన్సులు రద్దు చేస్తామని ఆదోని మార్కెట్‌యార్డ్ కమిటీ పాలకవర్గం హెచ్చరించారు. కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డు లో దళారులు నిబంధనలను పాటించకుండా రైతులకు ఇబ్బందులు కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే వారి లైసెన్సులను రద్దు చేస్తామని ఆదోని మార్కెట్‌యార్డ్ పాలకవర్గం స్పష్టం చేసింది. ​మార్కెట్‌యార్డులో జరుగుతున్న వేరుశనగ కొనుగోలు ప్రక్రియను మార్కెట్‌యార్డ్ కమిటీ చైర్మన్ జిందే శారద, వైస్ చైర్మన్ ఆదూరి విజయ్ కృష్ణ, సెక్రటరీ సీతారామయ్య మరియు […]

ఆదోని మాస్టర్ ప్లాన్ అమలు చేయకపోతే ప్రజాగ్రహం తప్పదు: నూర్ అహ్మద్ హెచ్చరిక

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో తీవ్రరూపం దాల్చుతున్న ట్రాఫిక్ సమస్య నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలంటే తక్షణమే మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి (ఎంహెచ్‌పీఎస్) రాష్ట్ర కార్యదర్శి ఎ. నూర్ అహ్మద్ డిమాండ్ చేశారు. గత 38 సంవత్సరాలుగా కొందరు ప్రజాప్రతినిధులు, అధికారుల అలసత్వం మరియు స్వార్థ ప్రయోజనాల వల్లే ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయిందని ఆయన ఆరోపించారు. పట్టణ అవసరాల నిమిత్తం వచ్చే స్థానిక, గ్రామీణ ప్రజలు ప్రతిరోజూ ట్రాఫిక్ ఇబ్బందులతో […]

ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి

భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్లాస్టిక్ భూతం నుండి సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రిటైర్డ్ డీఎస్పీ కొండారెడ్డి, కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ నాగభూషణం, వాకర్స్ కో-ఆర్డినేటర్ న్యాయవాది జీవన్ సింగ్ పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆదివారం ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. గత రెండు వారాలుగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా సీనియర్ సిటిజన్లు, మహిళలు, చిన్నారులు, అథ్లెట్లు […]

24వ తేదీ కలెక్టరేట్ ఎదుట ధర్నా

కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని దళిత కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 24వ తేదీ సోమవారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో ముమ్మరంగా ఆటోజాత ప్రచారం నిర్వహించారు. ​ఈ ప్రచారం మండల పరిధిలోని పెద్ద తుంబలం, గణేకల్లు, బసరకోడు, సలకలకొండ, దిబ్బనకల్లు, దాణాపురం, నారాయణపురం, చాగి గ్రామాల్లో సాగింది. ఈ సందర్భంగా […]

తుంగభద్ర జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం

హోస్పేట: 22.08.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా తగ్గుతువస్తుంది. ఆగస్టు 22 (శనివారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1630.20 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 94.819 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రవాహాల వివరాలు: ◆ ఇన్‌ఫ్లో (వరద నీటి […]

ఎల్‌ఎల్‌సీ ద్వారా సాగునీరు ఇవ్వకపోతే కలెక్టరేట్ ముట్టడి: ఎర్రకోట రాజీవ్ రెడ్డి హెచ్చరిక

కర్నూలు జిల్లా ​ఎమ్మిగనూరు లో ఖరీఫ్ పంటలకు ఎల్‌ఎల్‌సీ ద్వారా వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో భారీ ‘రైతు పోరుబాట’ ర్యాలీ నిర్వహించారు. ​స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి ప్రారంభమైన ర్యాలీ వైయస్సార్ సర్కిల్, అంబేద్కర్ సర్కిల్ మీదుగా ఎల్‌ఎల్‌సీ కార్యాలయం వరకు సాగింది. అనంతరం రైతుల సమస్యలపై ఎల్‌ఎల్‌సీ డీఈఈ (PVP సబ్ డివిజన్) […]

ఆదోని బుడేకల్ ఏరియాలో టీడీపీ ‘డోర్ టు డోర్’

ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయంఅని టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు అన్నారు. కర్నూలు జిల్లా ​ఆదోని పట్టణంలోని బుడేకల్ ఏరియాలో శుక్రవారం విస్తృతంగా ‘డోర్ టు డోర్’ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదోని నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు, టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ​ఈ సందర్భంగా […]

ఆదోని వాల్మీకి నగర్‌లో పోలీసుల కార్డన్ & సెర్చ్

కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాల్మీకి నగర్‌లో పోలీసులు శుక్రవారం విస్తృతంగా కార్డన్ & సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ జి. వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్, టూ టౌన్ సీఐ, త్రీ టౌన్ సీఐ, తాలూకా సీఐలతో పాటు ఇద్దరు ఎస్సైలు, 25 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ​◆ రౌడీ షీటర్ల ఇళ్ల సోదాలు: పరిసర ప్రాంతాల్లోని రౌడీ షీటర్లు, సస్పెక్ట్ […]

తుంగభద్ర జలాశయంనికి తగ్గుతున్న వరద ప్రభావం

హోస్పేట: 21.08.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 21 (శుక్రవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1630.18 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 94.743 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రవాహాల వివరాలు: ◆ ఇన్‌ఫ్లో (వరద నీటి […]

ఆదోనిలో 22, 23 తేదీల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)

ఆదోని (ఆగస్టు 20): కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 146-ఆదోని అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ నెల 22 (శనివారం), 23 (ఆదివారం) తేదీల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR-2026) కార్యక్రమాన్ని దశలవారీగా నిర్వహించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ​ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ పరిధిలోని తహసీల్దార్లు / అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (AEROలు) మరియు 284 మందికి పైగా బూత్ స్థాయి అధికారులు (BLOలు) […]

Back To Top