News
ఫీజ్ రియంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయండి
కర్నూలు జిల్లా ఆదోని లో కాలేజ్ చదువుతున్న విద్యార్థులకు ఫీజ్ రియంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ డి ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించేందుకు సిద్ధమవుతామని మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించరు. ఎంతోమంది పేద విద్యార్థులు కళాశాలలో ఫీజులు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నరని అలాగే డిగ్రీ పూర్తయిన విద్యార్థులు బీఈడీ పూర్తయిన విద్యార్థులు ఈజీ పూర్తయిన విద్యార్థులు కళాశాలలో సర్టిఫికెట్లు తీసుకోవాలంటే ఫీజు కళాశాలలో కడితేనే ఇస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని DSF విద్యార్థి సంఘం గా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
News
విమానయాన శాఖ మంత్రి ముందు ఆదోని సమస్యల చిట్టా..
ఆదోనిని జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ, ఆదోనిలో టిడిపి కార్యకర్తలకు జరుగుతున్న అవమానం, అన్యాయం గురించి మంగళగిరిలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కి ఫిర్యాదు చేశారు మైనార్టీ పరిరక్షణ సమితి యం.హెచ్.పి.యస్.రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్.
ఆదోని ప్రాంతము కరువు, వలసల వల్ల బీహార్ కంటే బాగా వెనుకబడిన ప్రాంతముగా తయారైందని ఆదోని ప్రజల పట్ల దయాచూపి ఆదోని డివిజన్ ను ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయాలని నూర్ అహ్మద్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నూర్ అహ్మద్ మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదోని అభివృద్ధి కోసం ఏమేమి చేయొచ్చని మంత్రి ప్రశ్నించరని పారిశ్రామిక అభివృద్ధి వల్ల ఆదోని అభివృద్ధి అయ్యే అవకాశం ఉందని ఆ దిశగా ప్రభుత్వం పని చేయాలని నూర్ అహ్మద్ సూచించామని తెలిపారు. అన్ని విషయాలను జాగ్రత్తగా నోట్ చేసుకొన్న మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తో మాట్లాడి ఖచ్చితంగా ఆదోనికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
అదేవిధంగా ఆదోని టిడిపి పార్టీ కార్యకర్తలు చాలా మంచివారు, అంకితభావంతో పని చేసే ఇలాంటి కార్యకర్తలను దూరం చేసుకోవద్దని,ఆదోనిలో గత పదేళ్లు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే చేతిలో నలిగిపోయారని, ప్రస్తుతం కూటమి ఓట్లతో గెలిచిన బిజెపి ఎమ్మెల్యే పార్థసారధి వైసిపి నాయకులను తమ పార్టీలో చేర్చుకుని వారికే మరలా పనులు ఆదాయ మార్గాలు చూపుతుండడంతో టిడిపి కార్యకర్తలు వరుసగా పదకొండవ సంవత్సరము కూడా ఇబ్బందులు తెలిపారు. రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చినా ఆదోని నియోజకవర్గం లో మాత్రం వైసిపి నాయకులదే హవా నడుస్తుందని వైసిపి నుంచి బిజెపిలో చేరిన నాయకులు కొందరు అరాచకాలు సృష్టిస్తూ ఆదోని అభివృద్ధిని అడ్డుపడుతున్నారని. అక్రమ దందాలకు పాల్పడుతున్నారని కాని వారిపై విచారణ జరిపి శిక్షించాలని కేంద్ర మంత్రిని కింజరాపు రామ్మోహన్ నాయుడు ని నూర్ అహ్మద్ విజ్ఞప్తి చేశామన్నారు.
దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి మాజీ వైకాపా నాయకుల అరాచకాలు అడ్డుకట్ట వేస్తామని, టిడిపి రాష్ట్ర అధ్యక్షునితో విచారణ జరిపించి టిడిపి కార్యకర్తలకు న్యాయం చేస్తామని, ఆదోని టిడిపి కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్, సంతేకుడ్లూరు గ్రామ ఎమ్ .హెచ్ పి.యస్. అధ్యక్షులు సద్దాం హుస్సేన్, గౌరవ సలహాదారు కుబేర స్వామి , షేక్షావలి టిడిపి కార్యకర్తలు తుంబళం మల్లికార్జున మరియు జడే కేశప్ప పాల్గొనినట్లు తెలిపారు.
News
విద్యార్థుల కోసం సమయానికి బస్సులు నడపండి
కర్నూలు జిల్లా..
పల్లెల నుంచి ఆదోని పట్టణానికి చదువుకోవడానికి వస్తున్న విద్యార్థులకు సమయానికి బస్సులు నడపాలని కోరుతూ ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరోద్వాజ్ DSF విద్యార్థి సంఘం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా DSF జిల్లా ఉపాధ్యక్షుడు ధనాపురం ఉదయ్, నవీన్ మాట్లాడుతూ పల్లెల నుంచి ఆదోని పట్టణానికి చదువుకోడానికి వస్తున్నా విద్యార్థులకు సమయానికి బస్సు రావడం లేదని విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. గతంలో అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు సమయానికి బస్సు నడపాలని అధికారులను కోరారు. ఇప్పటికైనా అధికారులు విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని సరైన సమయానికి బస్సులు నడిపేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు.
News
ఓవర్ బ్రిడ్జి పైనుండి దూకి ఆత్మహత్యాయత్నం
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని కల్లుబావి వీధికి చెందిన రంగస్వామి అనే మతిస్థిమితం లేని వ్యక్తి సోమవారం పాత ఓవర్ బ్రిడ్జి పైనుంచి ఎగిరి ఆత్మీయతయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడు బంధువులు వన్ టౌన్ పోలీసులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా రంగస్వామికి మతిస్థిమితం లేదని, ఆయన భవన నిర్మాణం కార్మికుడని తెలిపారు. ఉదయం ఇంటి నుంచి పనికి వెళ్లాడని బ్రిడ్జిపై నుంచి ఎగిరి కిందికి పడ్డాడని తెలిపారు. వెంటనే స్థానికులు ఆదోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు రిఫర్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
-
Business3 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పెరిగిన పత్తి ధరలు
-
Business1 week ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business2 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business3 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పెరిగిన పత్తి ధరలు
-
Business3 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పెరిగిన పత్తి ధరలు
-
Business1 week ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business3 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పెరిగిన పత్తి ధరలు
-
Business2 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పెరిగిన పత్తి ధరలు