News
అంతర్ జిల్లా మోటార్ సైకిల్ల దొంగ అరెస్టు

కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంతర్ జిల్లా మోటార్ సైకిల్ ల దొంగను అరెస్టు చేసిన వన్ టౌన్ సిఐ శ్రీరామ్. అతని వద్ద నుండి సుమారు రూ. 21,53,000/- రూపాయల విలువ గల 23 మోటార్ సైకిల్ లు స్వాధీనం చేసుకొని నిందితున్ని రిమాండ్ కి తరలించారు.
వన్ టౌన్ సిఐ శ్రీరామ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
వన్ టౌన్ సిఐ శ్రీరామ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ముద్దాయి మంగ పెద్ద రంగనాయకులు(40) అలియాస్ కొమరం పులి అలియాస్ పులి పై పలు ప్రాంతాలలో మోటార్ సైకిల్ లు మరియు పశువుల (గొర్రెలు, పొట్టేలు మరియు మేకలు) దొంగతనాలు చేసిన పది కేసుల వరకు ఉన్నాయని తెలిపారు. నిందితున్ని విచారించగా నాలుగు నెలల క్రితం బ్రాహ్మణకొట్కూర్లో ఒక స్కూటర్, దసర పండుగా రోజున శ్రీ రణమండల అంజినేయ స్వామి గుడి మెట్ల వద్ద పార్క్ చేసిన 05 మోటార్ సైకిల్లు, చిన్న శక్తి గుడి దగ్గర రావణ కాష్ట జరుగు సమయంలో 05 మోటార్ సైకిల్లు, కొత్త ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ ఎంట్రన్స్ వద్ద 12 మోటార్ సైకిల్ లు దొంగలించాడని నాలుగు కేసులలో మొత్తం 23 మోటార్ సైకిల్లను రికవరీ చేశామని మొత్తం వాటి విలువ సుమా రూ. 21,53,000/- వేల వరకు ఉంటుందని సిఐ తెలిపారు.

దొంగలించిన మోటార్ సైకిల్ ల వివరాలు కేసుల వారీగా:
Cr.No. 109/2024, U/Sec.303 (2) BNS of Adoni I town P.S.
1. TVS XL Super Heavy Duty BS Motor Cycle, Reg No. AP 21 BD 5330, Colour: Grey,
2. TVS XL Super Heavy Duty Motor Cycle, Reg No. AP39KK7049, Colour: AP Red,
3. TVS XL Super Heavy Duty Motor Cycle, Reg No. AP39BG9167, Colour: Moss Green.
4. TVS XL Super Heavy Duty Motor Cycle, Reg No. AP02CH4652, Colour: Moss Green.
5. TVS XL Super Heavy Duty Motor Cycle, Reg No. AP39 DE1044, Colour: Moss Green.

Cr.No. 110/2024, U/Sec.303 (2) BNS of Adoni I town P.S.
1. Passion Pro Motor Cycle, Reg No. AP 21 AY 9447, Colour: Black with Every Green.
2. Hero HF Deluxe Motor Cycle, Reg No. AP21BB2521, Colour: Black Red STR.
3. Honda Shine Motor Cycle, Reg No. AP21S6888, Colour: Black.
4. TVS XL Heavy duty Motor Cycle, Reg No. AP04AW4765, Colour: Flame Red.
5. TVS XL Heavy duty Motor Cycle, Reg No. AP39JS4076, Colour: Beaver Brown.

Cr.No. 112/2024, U/Sec.303 (2) BNS of Adoni I town P.S.
1. Bajaj Platinum Motor Cycle, Reg No. AP04P3750, Colour: Cocktail Wine Red.
2. Bajaj Pulsar Motor Cycle, Reg No. AP12F4668, Colour: Black.
3. Bajaj Pulsar Motor Cycle, Reg No. AP39BJ7803, Colour: Ebony Block Red DKI.
4. TVS XL Super Heavy Duty Motor Cycle, Reg No. AP04AK5033, Colour: M. Green.
5. Hero Splender+ Motor Cycle, Reg No. AP02G3063, Colour: Block.
6. Bajaj Pulsar Motor Cycle, Reg No. AP21CF3773, Colour: Ebony Black with Chrome Decal.
7. Hero Passion Pro Motor Cycle, నెంబర్ ప్లేట్ లేనిదిగా వుండి, Colour: Black with Every Green.
8. TVS XL Super Heavy Duty Motor Cycle, నెంబర్ ప్లేట్ లేనిదిగా వుండి, Colour: Grey.
9. Hero CD Deluxe Motor Cycle, నెంబర్ ప్లేట్ లేనిదిగా వుండి, Colour: Cocktail Wine Red.
10. Hero Splender+ Motor Cycle, నెంబర్ ప్లేట్ లేనిదిగా వుండి, Colour: Block.
11. Unicorn Motor Cycle, Reg No: CG19BC2625, Colour: Silver.
12. Bajaj Pulsar మోటార్ సైకిల్ నెంబర్ ప్లేట్ లేనిదిగా వుండి Colour: Black.
Cr.No. 121/2024, U/Sec. 379 IPC of Bhramhanakotkur P.S.
1. Bajaj Platinum CT 100, Reg No: AP 21 CF 2369, Colour: Ebony Black Red DKL గా ఉండినది.

News
పొలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడుబూరు మండలం గవి గట్టు గ్రామంలో పొలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో నీలకంఠ, బంగారయ్య ఇద్దరికీ గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నీలకంఠ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి పొలం విషయంలో పక్కన పొలంలో ఉన్న ఐదు మంది వ్యక్తులు ఇద్దరు మహిళలతో కలిసి వారిపై దాడి చేశారని తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

News
సుపరిపాలనకు కేరాఫ్ చంద్రబాబు.. గడ్డా ఫక్రుద్దీన్

కూటమి నేతృత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుపరిపాలనకు కేరాఫ్ గా నిలిచాడని టిడిపి ఎ పి రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి,గుంతకల్లు మైనారిటీ పరిశీలకుడు గడ్డా ఫక్రుద్దీన్ అన్నారు.

కర్నూలు జిల్లా ఆదోనిలో బుదవారం గడ్డా ఫక్రుద్దీన్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలకు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ, ఇవ్వని హామీలను అమలు చేస్తూ ప్రజల చేత మన్ననలు పొందుతున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంటింటా సుపరిపాలన పేరిట గడప గడప కు తిరిగి సమస్యలను తెలుసుకోవడం జరిగిందన్నారు. మంత్రి వర్గంలో తీసుకున్న 9 అంశాలలో బ్రిటిష్ వారి నుండి స్వేచ్ఛ వాయువు పీల్చిన రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం అమలు,సత్ప్రవర్తన కలిగి ఉండడంతో 17 మంది జీవిత ఖైదీలకు విముక్తి, రాష్ట్ర వ్యాప్తంగా 2048 ఎస్పీఎఫ్ పోలీసు లకు హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి, ఆటో డ్రైవర్ల తో సమావేశం ఏర్పాటు లాంటి సాహోసపేతమైన నిర్ణయాలు తీసుకున్న పరిపాలనాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు.
News
కాలేజ్ ప్రాంగణంలో నెట్‌వర్క్ టవర్‌ను తొలగించాలి విద్యార్థి సంఘాల డిమాండ్

కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నెట్‌వర్క్ టవర్‌ను వెంటనే తొలగించాలి DSF, PDSO, RPSF విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. PDSO రాష్ట్ర నాయకుడు తిరుమలేష్ DSF జిల్లా అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ RPSF జిల్లా అధ్యక్షుడు బాలు మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యానికి హానికరం అంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు.
కాలేజ్ మైదానంలో టవర్ ఉండటం వల్ల విద్యా వాతావరణం ప్రభావితం అవుతోందని వారు తెలిపారు. ఆర్ట్స్ కళాశాల మేనేజ్మెంట్ చొరవ చూపి వెంటనే స్పందించి తక్షణమే టవర్‌ను తొలగించాలని కోరారు. టవర్ ను తొలగించ లేకపోతే విద్యార్థులు అందరినీ సమీకరించి రానున్న రోజుల్లో బందుకు పిలుపునిస్తామని విద్యార్థి సంఘాలుగా ఆర్ట్స్ కళాశాల మేనేజ్మెంట్ కు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు షకీల్ వినీల్ రాజ్ కుమార్ నవీన్ వినోద్ మురళి తదితరులు పాల్గొనడం జరిగింది

-
News4 weeks ago
స్కూల్ కాలేజీల దగ్గర గుట్కాలు, సిగరెట్లు అమ్మితే చర్యలు
-
News4 weeks ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 09-07-2025
-
News4 weeks ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 10-07-2025
-
News3 days ago
ఆటో అదుపుతప్పి బోల్తా
-
News13 hours ago
పొలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
-
News4 weeks ago
కోట శ్రీనివాసరావు కన్నుమూత
-
Business4 weeks ago
Gold, Silver Price బంగారు ధర
-
News4 weeks ago
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు